Site icon NTV Telugu

Sabitha Indra Reddy: టెట్ వాయిదా కుదరదు

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy

తెలంగాణలో ప్రభుత్వం వరసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇప్పటికే గ్రూప్1, పోలీస్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లు రాగా… త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 4 నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సమాయత్తం అవుతోంది. ఇప్పటికే టెట్ కోసం ఆల్ రెడీ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేశారు.

ఇదిలా ఉంటే టెట్ ఎగ్జామ్ డేట్ మార్చాలంటూ పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. టెట్ ఎగ్జామ్ జరిగే జూన్ 12న ఆర్ఆర్బీ ఎగ్జామ్ కూడా ఉండటంతో రెండింటికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. పలువరు అభ్యర్థులు ఎగ్జామ్ డేట్ మార్చాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాజాగా ఓ అభ్యర్థి పరీక్ష వాయిదా వేయాలంటూ… మీరే చొరవ తీసుకోవాటంటూ మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు.

దీనిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పందించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే పరీక్ష తేదీలను నిర్ణయించామని… వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు. ట్వీట్ చేసే ముందు సంబంధిత అధికారులతో మాట్లాడానని.. టెట్ పరీక్షల్లో సుమారు 3.5 లక్షల మంది పాల్గొంటున్నారని… రాస్ట్రంలోని ఇతర పోటీ పరీక్షలకు, మూల్యాంకనానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రణాళిక రూపొందించామని… ఈ సమయంలో ఎగ్జామ్ రద్దు చేయడం కుదరదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీసుకున్న నిర్ణయంతో రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏదో ఒక పరీక్ష రాసేందుకు మాత్రమే అవకాశం ఏర్పడింది.

Exit mobile version