Site icon NTV Telugu

Sabita Indrareddy: అందరి సంక్షేమం కేసీఆర్ లక్ష్యం

Sabitaa

Sabitaa

తెలంగాణలో అందరి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం,తుక్కుగూడ లలో 254 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. నూతన జంటలకు శుభాకాంక్షలు తెలుపుతూ చెక్కులతో పాటు చిరు కానుకగా చీరను అందించారు. వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేసారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ. పేదింటి ఆడపిల్లలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ తో అండగా నిలబడ్డారని, అండగా ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్ అని మరచిపోవద్దని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా ప్రసవాలు చేస్తున్నారన్నారు. నార్మల్ డెలివరీ చేస్తే వైద్యులకు,సిబ్బందికి నజరానాగా 3 వేలు ఇస్తున్నామన్నారు. కేసీఆర్ కిట్ తో…పాటు ఆడపిల్ల పుడితే 13 వేలు,మగ పిల్ల పుడితే 12 వేలు ప్రభుత్వం అందిస్తుందన్నారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై దృష్టి సారించేలా,హెల్త్ ప్రొఫైల్ కూడా రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా 53 పరీక్షలు చేస్తున్నట్లు,వైద్యులు ఎవరైనా మందులు బయటకు రాస్తే స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బీపీ,షుగర్ కు సంబంధించి కిట్ ను ఇంటిదగ్గరే సిబ్బంది అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి,ఎంపీపీ రఘుమా రెడ్డి, వైస్ ఎంపీపీ సునీత అంధ్య నాయక్, సర్పంచ్ లు,ఎంపీటీసీ లు పాల్గొన్నారు.

Sub Registrars Corruption: ఇన్ ఛార్జి సబ్ రిజిస్ట్రార్ల చేతివాటం

Exit mobile version