Site icon NTV Telugu

Sabita Indra Reddy: కారు నడిపిన సబిత.. ఫోటోలు వైరల్

Sabita1

Sabita1

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లాలో దళిత బంధు లబ్ధిదారులకు వాహనాలు అందిస్తూ ట్రాక్టర్, కారు నడిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లాలో దళిత బంధు పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు సరూర్ నగర్ లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ గ్రౌండ్ లో జరిగిన యూనిట్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ సుధీర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాలే యాదయ్య, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు దయనంద్, ఎగ్గే మల్లేశం, కలెక్టర్ అమోయ్ కుమార్ తో కలిసి 347 మంది లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ చేశారు.

Read Also: Ponguleti Srinivas Reddy: నేను పార్టీమారతాననడం హాస్యాస్పదం

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ స్పూర్తితో దళిత బంధు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. దళిత బంధు దేశానికి ఆదర్శంగా మారుతుందన్నారు. దమ్ముంటే మీ బీజేపీ పాలిత రాష్టాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని బీజేపీ నేతలకు మంత్రి సబిత సవాల్ విసిరారు.

రక్షణ నిధి దళిత బంధు లబ్దిదారులకు భవిష్యత్తులో అండగా ఉంటుందని తెలిపారు. నియోజకవర్గానికి 2 వేల మందికి దళిత బంధు ఈ ఆర్థిక సంవత్సరంలో అందిస్తామని తెలిపారు. సబిత కారు నడుపుతుంటే అక్కడున్నవారు ఆమెని ప్రోత్సహించారు. గతంలో హోంమంత్రిగా పనిచేసిన సబిత ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే. సబిత కారు నడిపిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version