NTV Telugu Site icon

రైతు రుణ‌మాఫీ.. రెండో రోజు 38 వేల మందికి ల‌బ్ధి

Farmers

Farmers

అన్న‌దాత‌ల‌కు గుడ్‌న్యూస్ చెబుతూ.. రుణమాఫీ నిధుల విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం… ద‌శ‌ల‌వారీగా ల‌బ్ధిదారులైన రైతుల ఖాతాల్లో ఆ సొమ్మును జ‌మ చేస్తూ వ‌స్తుంది.. రూ.25 వేల నుంచి రూ.50 వేల లోపు రుణాలున్న రైతులకు రుణ‌మాఫీ నిధుల విడుదల కొన‌సాగుతుండ‌గా.. ఇక‌, రెండో రోజులో భాగంగా 38,050 మంది రైతుల ఖాతాల్లోకి రుణ‌మాఫీ నిధులను బ‌ద‌లాయించింది ప్ర‌భుత్వం.. ఇవాళ ఒకేరోజు రుణమాఫీ కింద రూ.100.70 కోట్లు ల‌బ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. క‌రోనా ప‌రిస్థితుల‌తో ఆర్థిక క‌ష్టాలున్నా.. రైతుల ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకుని.. రుణ‌మాఫీ చేస్తున్నామ‌ని తెలిపారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి.