NTV Telugu Site icon

42.43 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ల‌బ్ధి.. ఖాతాల్లో రూ.1153.50 కోట్లు జ‌మ

Rythu Bandhu

క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది తెలంగాణ ప్ర‌భుత్వం.. రైతుల‌కు అండ‌గా ఉంటూ రైతు బంధు ప‌థ‌కం కింద పంట సాయాన్ని అందిస్తోంది.. ఈ నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో సొమ్ము జ‌మ చేస్తోంది స‌ర్కార్.. ఇప్ప‌టి వ‌ర‌కు 42.43 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లో న‌గ‌దును జ‌మ చేశామ‌ని.. మూడు రోజుల్లో రైతుబంధు కింద రూ. 1153.50 కోట్లు జ‌మ చేసిన‌ట్లు వెల్ల‌డించారు అధికారులు.. ఇక‌, నాలుగో రోజులో భాగంగా రేపు మ‌రో 7.05 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లోకి నగ‌దు జ‌మ చేయ‌నున్నారు.. 58.85 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు గాను రూ. 2,942.27 కోట్లు జ‌మ చేస్తారు.. కాగా, మొద‌ట్లో ఎక‌రాకు రూ.4 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జ‌మ చేసిన ప్ర‌భుత్వం.. ఆ త‌ర్వాత ఆ మొత్తానికి రూ.5 వేల‌కు పెంచిన సంగ‌తి తెలిసిందే.