NTV Telugu Site icon

RS Praveen Kumar: కవిత అరెస్ట్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్

Rs Praveen Kumar

Rs Praveen Kumar

RS Praveen Kumar: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె అరెస్టుపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. రాజకీయ కుట్రలో భాగమే కవిత అరెస్ట్ చేశారని ట్విట్ చేశారు. మోడీ ప్రభుత్వం ఈడీనీ అడ్డంపెట్టుకొని చేసిన అక్రమ అరెస్ట్ ఒక బూటకం. దీన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ కుటిల ఎత్తుగడలకు తలొగ్గకుండా, విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారితో ఎన్నికల పొత్తుకు సమ్మతించకూడదిని, అదేస్థాయిలో ఉన్న బీజేపీ-కాంగ్రెస్ వ్యతిరేక లౌకిక జాతీయ పార్టీ అయిన బీఎస్పీ తో పొత్తుకు చేతులు కలిపిన కొన్నిగంటల్లోనే మోడీ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ కు తెర తీశారని మండిపడ్డారు.

Read also: Kurnool Crime: కర్నూలులో దారుణం.. నాన్నమ్మను చంపి ఇంట్లోనే పాతిపెట్టిన మనవడు..

ఇది ముమ్మాటికీ అప్రజాస్వామికం మని, ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంపై దెబ్బకొట్టడం తప్ప మరొకటి కాదన్నారు. ఈ లాంటి అక్రమ అరెస్ట్ లతో అదిరేది బెదిరేది లేదని, బెదిరితే తెలంగాణ వచ్చేది కాదన్నారు. ఈ దుశ్చర్య కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న లోపాయకారి ఒప్పందంలో భాగమే అన్నారు. ఈడీతో బీజేపీ-కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేయించిన ఈ అక్రమ అరెస్ట్ ను తమ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా భావించి ఈ రెండు దోపీడీ దొంగల పార్టీలకు రేపు జరగబోతున్న భారత పార్లమెంట్ ఎన్నికల్లో తిరగబడి ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతున్నారని తెలిపారు. దేశంలో మోడీ పాలన నాటి నాజీల నియంతృత్వం కన్నా ఘోరంగా ఉందన్నారు. మొన్న సాయిబాబా సిసోడియా, నిన్న హేమంత్ సోరెన్, నేడు కల్వకుంట్ల కవిత, రేపు నువ్వో నేనో…? అందుకే తెలంగాణ సమాజం, యావత్తు దేశం బీజేపీ-కాంగ్రేసులను తక్షణమే తిరస్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.


Avantika Vandanapu : ఆ సమయంలో అమెరికా వెళ్ళడానికి కారణం అదే..?

Show comments