Avantika Vandanapu : ఆ సమయంలో అమెరికా వెళ్ళడానికి కారణం అదే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమయిన ఒక అమ్మాయి..ఇప్పుడు హాలీవుడ్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. వరుసగా హాలీవుడ్ వెబ్ సిరీస్లలో మెరుస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. తను మరెవరో కాదు.. అవంతిక వందనపు. అక్కడ వరుస సిరీస్ లు సినిమాలతో బిజీ అయిన అవంతిక.. మొదటిసారి తెలుగు ప్రేక్షకులతో ముచ్చటించడానికి సిద్ధమయ్యింది. కొన్నాళ్ల క్రితం మొదటిసారి ఒక తెలుగు ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.‘ప్రేమమ్’, ‘బ్రహ్మోత్సవం’ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన అవంతికకు ఆ తరువాత అంతగా అవకాశాలు రాలేదు.. దీంతో ‘బ్రహ్మోత్సవం’ విడుదల అవ్వగానే అమెరికాకు వెళ్లిపోయింది. 2017లో తను అమెరికాకు వెళ్లిన విషయాన్ని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బయటపెట్టింది అవంతిక.
‘‘చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయొచ్చు, హీరోయిన్ గా చేయొచ్చు. కానీ మధ్యలో మాత్రం చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ సమయంలో ఖాళీగా ఉండడం తట్టుకోలేక అమెరికాకు వెళ్లిపోయాను. 5 ఏళ్లలో హాలీవుడ్లో ఒక కెరీర్ ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఇప్పుడు అదే జరుగుతుంది’’ అంటూ అసలు అమెరికాకు వెళ్లిన కారణాన్ని బయటపెట్టింది అవంతిక.‘‘ఇప్పుడు నాకు మళ్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడానికి ఇంట్రెస్ట్ ఉంది. టాలీవుడ్, బాలీవుడ్ మరియు హాలీవుడ్ అన్నింటిలో కాలుపెట్టాలి, అన్నింటిలో ఒక కెరీర్ ఉండాలి అన్నదే నా లక్ష్యం’’ అని చెప్పుకొచ్చింది అవంతిక. తన కాన్ఫిడెన్స్ చూసి చాలామంది ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అయిదేళ్లలో హాలీవుడ్ లో కెరీర్ ఏర్పడాలని లక్ష్యంగా పెట్టుకొని అది సాధించి చూపించిందని అంతా ప్రశంసిస్తున్నారు. ఇక తను ప్రస్తుతం న్యూయార్క్ లో ఉంటూ అక్కడే కాలేజ్లో చదువుతున్నానని తెలిపింది. తను పుట్టి, పెరిగింది అమెరికాలోనే అని, తనకు పదేళ్లు ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చామని చెప్పింది. కానీ తన కుటుంబం అంతా హైదరాబాద్ కి చెందినదే అని తెలిపింది..
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!