NTV Telugu Site icon

నేను అధికారంలోకి వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ కి కరెంట్ చేస్తా…

కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… నన్ను చూస్తే గజగజ వణుకుతున్నారు. నా సభలకు కరెంట్ కట్ చేస్తున్నారు. అదే నేను అధికారంలోకి వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ కి కరెంట్ చేస్తా అని తెలిపారు. హుజురాబాద్ ఎన్నిక వస్తేనే దళితుల మీద ప్రేమ పుట్టుకు వచ్చింది. ట్రాక్టర్లకు ఓనర్లు కాదు.. కంపెనీలకు ఓనర్లను చెయ్యాలి. అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారు. మంత్రి హోదాలో ఉండి.. తొడ గొట్టి మాట్లాడతారా. మీ కాలేజీల్లో విద్యార్థులకు నేర్పేది అదేనా మల్లారెడ్డి అని ప్రశ్నించారు. మల్లారెడ్డిని వెంటనే పదవి బహిష్కరించాలి అని తెలిపారు.

మీరు ప్రజలకు ఏం భాష నేర్పిస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీని ఎప్పుడైనా రద్దు చేస్తారు. హుజురాబాద్ లో టీఆరెస్ గెలిచినా ఓడినా ఏమీ కాదు అని అన్నారు. బీజేపీకి చిత్త శుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పై దర్యాప్తు చేయాలి. బీజేపీ, టీఆరెస్ డ్రామాలు ఆడుతున్నాయి అని పేర్కొన్నారు.

Show comments