NTV Telugu Site icon

Fake Gold: తక్కువ ధరకు బంగారం.. రూ.1.1 కోట్లు టోకరా

Fake Gold

Fake Gold

Fake Gold: కస్టమ్స్ నుంచి కొనుగోలు చేసిన బంగారాన్ని తక్కువ ధరకు విక్రయిస్తున్నామని వ్యాపారులను నమ్మించి కోట్లాది రూపాయలను మోసం చేస్తున్న ముఠాను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 51 లక్షల నగదు, రూ. 6.86 కోట్ల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వివరాలను నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ తరుంజోషి వెల్లడించారు.

Read also: Deputy CM Pawan Kalyan: బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. వదిన ఇచ్చిన పెన్‌తో తొలి సంతకం..!

నెల్లూరు జిల్లా కావలికి చెందిన కర్రెద్దుల విజయ్‌కుమార్ బీటెక్ పూర్తి చేశాడు. తక్కువ ధరకు బంగారం విక్రయిస్తున్నట్లు గ్రామంలో జరిగిన మోసం తెలుసుకుని అదే విధంగా ప్లాన్ చేశాడు. ఇందుకోసం తన స్వగ్రామానికి చెందిన వృత్తిరీత్యా డ్రైవర్ బోగిరి సునీల్ గవాస్కర్ అలియాస్ హరీష్, అడిగోపుల ఓం సాయి కిరీటి, తెనాలికి చెందిన వ్యాపారి నంబూరి డేవిడ్ లివింగ్ స్టోన్ అలియాస్ సెంథిల్ లతో ముఠాగా ఏర్పడ్డాడు. ప్రధాన నిందితుడు విజయ్‌కుమార్‌పై కావలిలో 13 చీటింగ్ కేసులు, స్థానిక పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో బెంగుళూరుకు మకాం మార్చిన సెంథిల్‌పై రెండు చీటింగ్ కేసులు నమోదయ్యాయి.

Read also: Income Tax Department: పాన్ జిరాక్స్ లు ఎవరికైనా ఇస్తున్నారా..? అయితే మీరు ఈ వీడియో చుడాలిసిందే..

వ్యాపారికి బురిడీ కొట్టించారు..

బోడుప్పల్‌కు చెందిన దిలీప్ బర్ఫా వృత్తిరీత్యా వ్యాపారవేత్త. మే 19న తన స్నేహితుడు సింగిరెడ్డి సురేష్‌కి అందిన సమాచారంతో బెంగళూరులోని టీసీ పాళ్యకు వెళ్లి అక్కడ విజయ్‌కుమార్‌, సునీల్‌ గవాస్కర్‌లను కలిశాడు. రూ. 6 లక్షలు ఇచ్చి 101 గ్రాముల బంగారం ఇచ్చాడు. దీంతో దిలీప్‌ను ఒప్పించి 2 కిలోల బంగారం కోసం మొదట రూ. 20 లక్షలు అడ్వాన్స్. వారం తర్వాత బెంగళూరు వెళ్లి విజయ్‌కుమార్‌ను కలిశాడు. ఆ సమయంలో 5 కేజీల బంగారాన్ని విక్రయిస్తున్నట్లు, కొనుగోలుదారులు డబ్బులు ఇస్తున్నారని, అన్నీ నకిలీ బంగారం, నకిలీ నోట్లే అని నాటకాలాడారు. ఈ డ్రామా చూసిన బాధితురాలు నిజమేనని నమ్మించాడు. దీంతో మిగిలిన రూ. 90 లక్షలు కూడా చెల్లించారు.

Read also: HCA Power Bill: కోటి 48 లక్షల చెక్.. విద్యుత్‌ బిల్ వివాదానికి హెచ్‌సీఏ ముగింపు!

మీ స్టాక్ ఇంకా రాలేదు, మమ్మల్ని మా మేనేజర్‌ని కలవడానికి చెన్నైకి తీసుకెళ్లి, రాయల్ మెరిడియన్ హోటల్‌లో రూమ్ బుక్ చేసాము. సెంథిల్‌ను అందించారు, అయితే బంజారాహిల్స్‌లోని రోడ్‌నెం.35లో మీ బంగారాన్ని సేకరించాలని సూచించాడు. ఆ తర్వాత బాధితురాలు అక్కడి నుంచి రాగానే ఆ ముఠా సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. ఆ తర్వాత సెల్‌ఫోన్‌ ఆన్‌లో ఉన్నా ఫోన్‌లు తీయకపోవడంతో అనుమానం వచ్చి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ముఠాను పట్టుకుని విచారించి వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి రూ. 51 లక్షల అసలు నగదు, పోలీసు కానిస్టేబుల్ యూనిఫాం, మూడు ఖరీదైన కార్లు, రూ. 6.86 కోట్ల నకిలీ నోట్ల కట్టలు, 5 కిలోల నకిలీ బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.
Darshan: నటుడు దర్శన్‌కి మరో టెన్షన్.. ఇంటిని కూల్చేసే యోచనలో సర్కార్?