NTV Telugu Site icon

Wines Theft: వైన్స్‌లో భారీ చోరీ.. రూ.80 వేల మందు బాటిళ్లు మాయం

Wine Chorry

Wine Chorry

Wines Theft: ఈ మధ్యన దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, బ్యాంకులే కాకుండా వివిధ రంగాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ దొంగలు కూడా అలాగే అనుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 80 వేల విలువైన మందు బాటిళ్లను దొంగలించారు. వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా రెండు రోజులు వైన్ షాప్ లు బంద్ ఉండాలని పోలీసులు ప్రకటించారు. ఎంటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఫుల్ గా మందు తాగి డ్యాన్స్ చేయడం అందరి ఇబ్బంది పెట్టడం జరగకూడదని వైన్ షాప్ లను బంద్ చేశారు. అయితే దీని తట్టుకోలేక పోయారో.. రెండు రోజులు బంద్ చేస్తే మేము తగ్గుతామా అనుకున్నరో ఏమో గానీ ప్లాన్ ప్రకారం వచ్చి వైన్ షాప్ లో మందు బాటిళ్లను దొంగలించి పరారయ్యారు. అయితే.. ఈ దొంగతనం చేసింది నిజంగానే దొంగేనా లేకా మందుబాబులా అనే సందేహం కలుగుతుంది.

Read also: Rashi Phalalu : ఈ రోజు ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామ శివారులో వెంకటేశ్వర వైన్స్ ఉంది. మంగళవారం అర్థరాత్రి యథావిధిగా.. వైన్స్ మూసివేసి తాళాలు వేసి.. సిబ్బంది వెళ్లిపోయారు. కట్ చేస్తే.. బుధవారం ఉదయం వైన్స్ తెరవడానికి వచ్చిన యజమాని సారా సంతోష్ గౌడ్ షాక్ కు గురయ్యాడు. వచ్చేసరికి షెట్టర్ కాస్త తెరిచి ఉంది. దీంతో… వెంటనే తన భాగస్వామి దామోదర్ రెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పగా… అతడు కూడా గురై వైన్స్ వద్దకు వచ్చాడు. ఇద్దరూ వైన్స్ పూర్తిగా తెరిచారు. షాప్ అంతా గందరగోళంగా ఉంది. దాదాపు రూ. 80 వేల మద్యం సీసాలు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అన్ని వైన్స్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. చోరీ జరిగిన తీరు చూస్తుంటే.. తెలిసిన వాళ్లెవరో ఈ పని చేసి ఉంటారని యజమానులు అనుమానిస్తున్నారు. వైన్స్ షాప్ సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. వీరికి తెలిసిన వారేనా? లేక అసలు దొంగలు ఈ పని చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Credit Card: ఇన్ కమ్ ప్రూఫ్ లేకున్నా క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?