NTV Telugu Site icon

ఆసుపత్రిలో ఆభరణాలు చోరీ

రోగి నుండి బంగారం చోరీ చేసిన ఘటన హైదరాబాద్ లోని కె.పి.హెచ్.బి పరిధిలో జరిగింది. ఈ నెల 5వ తేదీన హృద్రోగ సమస్యలతో శ్రీశ్రీ హోలిస్టిక్ ఆసుపత్రిలో బాధితురాలు చేరింది. వైద్యం కొరకు ఆసుపత్రికు వచ్చిన రోగి నుండి జక్కిరాముడు అనే వార్డు బాయ్ బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని కె.పి.హెచ్.బి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మెడలో ఉండాల్సిన మూడు తులాల బంగారు గొలుసు కనిపించకపోవటంతో ఆమె మనువడు సాయి గోపి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని, నిందితుడు జక్కిరాముడును అరెస్ట్ చేసి, మూడు తులాల బంగారు గొలుసు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.