NTV Telugu Site icon

Robbers: బాసరలో దోపిడీ దొంగల హల్చల్..

Robbers

Robbers

Robbers: దోపిడీ దొంగలు ఇంటింటికి తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి అయిందంటేనే ఏప్రమాదం ఎలా ముంచుకొస్తుందో అని బెంబేలు ఎత్తుతున్నారు. ఊర్లకు వెళ్లాలన్నా.. ఇంటి పై వెళ్లి పడుకోవాలన్నా జంకుతున్నారు. తాళం వేసిన ఇల్లకే కాకుండా రాత్రి సమయంలో ఒక్కరున్నా దొంగలు చొరబడి వారిని భయభ్రాంతులు చేసి చోరీ చేస్తున్న తీరుపై ప్రజలు భయంతో బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. ఓ ఇంట్లో చొరబడి వృద్దురాలని భయపెట్టి అందినికాటికి సొత్తును దోచుకెళ్లడమే కాకుండా అక్కడే వున్న మరో రెండు ఇల్లలో చోరీకి పాల్పడిన ఘటన నిర్మల్‌ జిల్లా బాసలరో కలకలం రేపింది.

Read also: Top Headlines @9AM: టాప్ న్యూస్

నిర్మల్ జిల్లా బాసరలో అర్థ రాత్రి పూట దోపిడీ దొంగల హల్చల్ సృష్టించారు. ఉప్పుకుంట కాలనీ లో మూడు ఇండ్లలో తాలాలు పగలకొట్టి దొంగతనానికి ప్రయత్నం చేశారు. మరో కాలనీలోని రెండు ఇండ్లలో చోరీ చేసి అక్కడి నుంచి పరార్‌ అయ్యారు. మైలాపూర్ లో ఓ ఇంటిలో చొరబడి దుండగులు ఓ వృద్ధ మహిళను బెదిరించారు. అక్కడే ఓ వృధ్దురాలు వారిని చూసి గట్టిగా అరవడానికి ప్రయత్నించింది. అయితే దుండగులు ఆమెను గడ్డ పారతో చంపేస్తా అని బెదిరించారు. దీంతో ఆవృద్ధురాలు ఏమీ చేయలేక పోయింది. దుండగులు ఆమె వద్ద వున్న పుస్తెల తాడు, పట్ట గొలుసు, నగదు తీసుకుని ఉడాయించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన కాలనీకి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాలనీలోని సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
Singapore: సింగపూర్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తికి ఉరి

Show comments