NTV Telugu Site icon

Vikarabad Students: ఎమ్మెల్యే సార్‌ పట్టించుకోండి.. రోడ్డుకోసం రోడ్డెక్కిన విద్యార్థులు

Vikarabad Students

Vikarabad Students

Vikarabad Students: తెలంగాణాలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ గుంతలుగా మారాయి. పలు జిల్లాల్లో రోడ్డన్నీ అధ్వాన్నంగా మారాయి. వారిగ్రామంలో రోడ్డులు అధ్వాన్నంగా తయారయ్యాయని రోడ్డు పనులు చేపట్టాలని ఎమ్మెల్యేని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు. దీంతో ట్రాఫిక్‌ స్థంబించింది. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం కరణ్‌ కోట్ రోడ్డు మార్గంలో ఈ సంఘటన జరిగింది.

Read also: CM JaganMohan Reddy: పొలిటికల్ పంచ్‌ లు.. పవన్, బాబుపై విసుర్లు

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాండూరు – కరణ్‌ కోట్ రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. అడుగు అడుగుకు ఓగుంత పడి ఈ మార్గంలో ప్రయాణికులకు నరకకూపంగా మారింది. కరణ్ రోడ్డు అంటేనే వామ్మో అక్కడినుంచి వెళ్లమంటూ ఆటోలు, బస్సులు సరిగా రావడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ పాఠశాలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఈ మార్గం ద్వారానే ప్రయాణించాలి అయితే రోడ్డు గుంతలు గుంతలుగా వుండటంతో.. ప్రయాణం చేయలేక విసిగిపోతున్నారు. ఇక చేసేదేమి లేక కరణ్‌ కోట్ రోడ్డు మీదకు వచ్చి విద్యార్థులందరూ ధర్నాకు దిగారు. తక్షణం రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని ఎమ్మెల్యేను కోరుతూ.. డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఎమ్మెల్యే చొరవ తీసుకుని తక్షణమే అధికారులకు చెప్పి బాగుచేయించాలని కోరారు. ఎమ్మెల్యే సార్‌ జర పట్టించుకోండి అంటూ నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల ధర్నాతో అటు.. ఇటూ రాకపోకలు స్థంభించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు, ఆందోళన కారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇక.. రోడ్డు మరమ్మత్తులుపై స్పష్టమైన హామి రావడంతో ఆందోళన విరమించారు విద్యార్థులు.
RRR In Japan: జపాన్‌లో RRR క్రేజ్‌.. అస్సలు తగ్గడం లేదుగా..