Rajendranagar Crime: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీస్ అకాడమీ సమీపంలో ఎమర్జెన్సీ లేన్ లో ఆగి ఉన్న లారీని వేగంగా ఢీ కొట్టింది కారు. స్పీడ్ గా లారీని ఢీ కొట్టడంతో కారు సగం వరకు దూకుకొని వెళ్లింది. దీంతో కారు నడుపుతున్న డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో డ్రైవర్ మృతదేహం ఇరుక్కుని పోయింది. స్థానికులు పోలీసులకు సమచారం అందించడంతో.. హుటా హుటిన చేరుకుని క్రేన్ సహాయంతో కారును బయటకు లాగీ అతి కష్టం మీద మృతదేహాన్ని ట్రాఫిక్, ఓఆర్ఆర్ సిబ్బంది బయటకు తీసారు. గచ్చిబౌలి నుండి శంషాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని కాప్స్ అంటున్నారు. మృతుడు కర్ణాటకకు చెందిన రేవన్ సిద్ధాగా గుర్తించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Reada also: Astrology : మార్చి 29, బుధవారం దినఫలాలు
నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు భీంగల్ వద్ద రాగానే రోడ్డు పక్కనే ఓ జేసీబీ దానిపై పడిపోయింది. కారులో వున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కానీ కారులోనే ఇద్దరు ఇరుక్కుపోయారు. స్థానికంగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కారులో చిక్కుకున్న ఇద్దరిని బయటకుతీసి ఆసుపత్రికి తరలించారు. బాధితులను మోర్తాడ్‌కు చెందినవారిగా గుర్తించారు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Cruel Daughter: ఒళ్లు గగుర్పొడిచేలా తల్లిదండ్రులను గొడ్డలితో నరికేసింది.. డ్రగ్స్ ఇచ్చి మరీ..
సూర్యాపేటలో ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. ఖమ్మం డిపోకు చెందిన రాజధాని AC బస్ TS – 04Z – 0198 లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ఇంజిన్ నుంచి మంటలు రావడాన్ని గమనించి బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులందరిని కిందికి దిగిపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతోనే బస్సులో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో ప్రయాణికులందరు ఊపిరి పీల్చుకున్నారు.
Sperm Donor: ఈ వైద్యుడికి 550 మంది సంతానం..! కోర్టుకెక్కిన మహిళ