NTV Telugu Site icon

ఘోర రోడ్డు ప్రమాదం.. మృత్యువులోనూ వీడని స్నేహబంధం

హైదరాబాద్ శివార్లలోని చేవెళ్ల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు సమాచారం. చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు.

మృత్యువులోనూ వీడని స్నేహబంధం

ఆ మిత్రుల ఆనందాన్ని చూసి.. విధికి కన్ను కుట్టిందో ఏమో.. అప్పటి దాకా ఆనందోత్సాహాలతో గడిపిన ముగ్గురు మిత్రులు అంతలోనే విగత జీవులయ్యారు. ఫ్రెండ్ బర్త్ డే కు కేక్ కోసమని. .బైక్ పై చేవెళ్లకు బయలుదేరారు. గుర్తు తెలియని వాహనం అతివేగంతో వీరు ప్రయాణిస్తున్న బైక్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్నేహితులు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. పుట్టిన రోజే జయవర్ధన్ తో సహా అతని స్నేహితులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కలిచివేసింది. ముగ్గురు స్నేహితుల మృత్యువాతతో వారి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది.