NTV Telugu Site icon

RJ Swathi: కేటీఆర్ పై అద్భుతమైన ర్యాప్.. పాడి రఫ్పాడించిన ఆర్ జే స్వాతి

Rj Swathi

Rj Swathi

RJ Swathi: మంత్రి కేటీఆర్ నిన్న రేడియో మిర్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు ఆర్జే స్వాతి స్వాగతం పలికారు. కేటీఆర్ ను ఆర్ జే స్వాతి సార్ సార్ అంటూ నాపేరు ఆర్ జే స్వాతి అని మీ మీద ఒక పాటరాసాను పాడతాను అన్నారు. ఇప్పుడా అంటూ కేటీఆర్ అనగానే అక్కడున్న వారందరూ నవ్వుకుంటారు. అయితే ప్లీస్ సార్ అంటూ స్వాతి అనగానే సరే పాడండి అంటూ కేటీఆర్ నిలబడ్డారు. అంతే కేటీఆర్ పై అద్భుతమైన ర్యాప్ పాడి రఫ్పాడించారు ఆర్.జే స్వాతి. ఇక ఆర్ జే స్వాతి పాట పాడటం మొదలు.. హైదరాబాద్ సిటీని, కేటీఆర్ ను ఉద్దేశించి హైదరాబాద్ అంటేనే హైపర్ గా ఉంటాం!. బిర్యానీ తింటూనే ఇరానీ ఛాయ్ అంటాం. మండే టు ఫ్రైడే ఆఫీసుకే పోతాం. మెట్రో ఎక్కి దిగేదాకా ముచ్చట్లే పెడతాం. ఐటీ మాదే.. ఫార్మా మాదే.. స్కైక్ వాకు మీద మేము క్యాట్ వాక్ చేస్తాం. కేబుల్ బ్రిడ్జి ఎక్కి మేము కేరింతలు కొడతాం.. అంబేద్కర్ బొమ్మకేమో సెల్యూట్ కొడతాం.. ఫస్ట్ మనమే.. బెస్ట్ మనమే.. సాటి లేని స్కిల్ ఉన్న సిటీ మాదే! అన్నింట్లో అవార్డులు మనమే.. బోనాల పండుగకు పూనకాలు ఊగుతాం.. దసరా పండుగకు బోనాలే ఆడతాం.. మనది హైద్రాబాదు.. దేశంలో మనమే జోరు.. మన కేటీఆరు.. ఇగ సూడర జోరు అంటూ హుషారైన ర్యాప్ పాడి అక్కడ ఉన్న వారిని ఆకట్టుకుంది. ఆర్ జే స్వాతి ర్యాప్‌కు మంత్రి కేటీఆర్ ముగ్ధుడై ఆమెకు అభినందనలు తెలిపారు.

అనంతరం హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో గిరిజన పారిశ్రామికవేత్తల సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. సీఎం కేసీఆర్ మారుమూల ప్రాంతంలో పుట్టారని, ముంబైలోని షాపూర్ జీ పల్లోంజీ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చాక సింగిల్ విండో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయానని చెప్పారు. అయినా పట్టుదలతో ముందుకు సాగాడు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ ఇక వెనుదిరిగి చూడలేదు. గిరిజన పారిశ్రామికవేత్తలను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ఐదు వేల మంది యువకులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. అవసరమైతే ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ప్రొడక్ట్‌ పార్క్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. మీరందరూ భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు కావాలని సూచించారు.

Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం.. భవనంపై నుండి దూకి విద్యార్ధిని మృతి..