Site icon NTV Telugu

రైతుల హ‌క్కుల‌ను బీజేపీకి తాకట్టు పెట్టింది : టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై రేవంత్ రెడ్డి ఫైర్‌

తెలంగాణ రైతుల హ‌క్కులను టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం బీజేపీకి తాకట్టు పెట్టిందని.. రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఖరీఫ్ ధాన్యం కొనకుండా రైతు సమస్య నుండి తప్పించుకునే కుట్ర సీఎం కెసిఆర్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. మూడు నెలల నుండి రైతులు హరిగోస పడుతున్నారని… కళ్ళాల దగ్గర వడ్లు, ఇంటి దగ్గర రైతుల శవాలు అన్నట్టుంది పరిస్థితి ఉంద‌ని ఫైర్ అయ్యారు.

https://ntvtelugu.com/harish-rao-comments-on-siddipet-development/

రైతుల చావులకు, వడ్లు కొనక పోవడాని బీజేపీనే కారణం అని ఢిల్లీ పోయారని… ఖరీఫ్ లో కొనే ధాన్యం సంగతి వదిలి.. యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ పెడుతున్నారని ఆగ్ర‌హం రేవంత్ రెడ్డి వ్య‌క్తం చేశారు. రాష్ట్రం చేసుకున్న ఒప్పందం ప్రకారం బియ్యమే ఇవ్వలేదని కేంద్రం చెబుతుంద‌ని.. పార్లమెంట్ లో నిరసన చేస్తామ‌ని వచ్చిన ఎంపీలు.. సెంట్రల్ హాల్ నిరసన ప్లే కార్డులు పట్టుకున్నారని ఆగ్ర‌హించారు. టీఆర్ ఎస్ ఎంపిలు ప్రజలను మోసం చేశారని… ఓ రోజు పోడియం దగ్గర నల్ల చొక్కాలతో వచ్చి… బైకాట్ చేశారని మండిప‌డ్డారు.

Exit mobile version