వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఇందులో జాతీయ సగటును మించి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఉంది అని తెలిపిన అయన… వ్యాక్సినేషన్ వేగం మరింత పెంచాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక శనివారం జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో 350 పడకలు గల కింగ్ కోఠి జిల్లా దవాఖానలో సాధారణ వైద్యసేవలు పునరుద్ధరణ చేయనున్నారు. టిమ్స్ హాస్పిటల్‌లో 200 పడకలు మినహా సాధారణ వైద్య సేవలు ప్రారంభం చేయనున్నారు. ఇక టిమ్స్ సిబ్బంది పెండింగ్ జీతాలు చెల్లింపు పై నిర్ణయం తీసుకోగా… టిమ్స్ ఆసుపత్రి బకాయిలు కూడా చెల్లించనున్నారు. ఇక వ్యాక్సినేషన్ కార్యక్రమంపై శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
వ్యాక్సినేషన్ వేగం పెంచాలని మంత్రి హరీష్ రావు ఆదేశాలు…
