NTV Telugu Site icon

Revanth Reddy: పాదయాత్రకి బయలుదేరిన రేవంత్.. హారతి ఇచ్చిన కూతురు నైనిషా..

Revantreddy Padayatra

Revantreddy Padayatra

Revanth Reddy: హత్ సే హత్ జోడో అభియాన్ లో భాగంగా రేవంత్ పాదయాత్ర ఇవాల్టితో షురూ కానుంది. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఇంటి నుంచి పాదయాత్రకి బయలుదేరిన రేవంత్ ను కూతురు నైనిషా హారతి ఇచ్చారు. తండ్రి నుదిట బొట్టుపెట్టి పాదయాత్రకు సాగనంపారు. నవ్వుతూ రేవంత్‌ పాదయాత్రకు ముందుకు సాగారు. వరంగల్ హైవే మీదుగా రేవంత్ ములుగుకు బయలుదేరనున్నారు. ములుగులో గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Read also: Harish Rao: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ ఉండబోతుంది

మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్ర రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇవాళ మేడారం నుంచి కొత్తూరు, నార్లాపుర్, ప్రాజెక్ట్ నగర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 2 నుంచి 2 30 వరకు ప్రాజెక్ట్ నగర్ లో భోజన విరామం అనంతరం ప్రాజెక్ట్ నగర్ నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4:30 నుంచి 5 గంటలకు పస్రా గ్రామంలో టీ విరామం ఉంటుంది. పస్రా జంక్షన్ లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు పస్రా నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేరుకోనుంది. రాత్రికి రామప్ప గ్రామంలో రేవంత్ రెడ్డి బస చేయనున్నారు.
Bandi Sanjay: నాందేడ్ వేదిక పెద్ద డ్రామా.. ఇక్కడే గతిలేదు అక్కడ పట్టించుకుంటారా?

Show comments