NTV Telugu Site icon

CM Revanth Reddy: పోచారం మాకు అండగా నిలవడటానికి ముందుకు వచ్చారు..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌లో సీనియర్‌ నేతగా ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు భాస్కర్‌రెడ్డితో కాంగ్రెస్ లోకి చేరడంతో బీఆర్ఎస్ కు పెద్ద షాక్‌ తగిలింది. ఈ ఉదయం పోచారం ఇంటికి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడంతో పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో సంబరాలు నెలకొన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం మా తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. పోచారం ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యిందన్నారు.

Read also: CM Revanth Reddy: కాంగ్రెస్​ లోకి రండి.. పోచారంను ఆహ్వానించిన సీఎం రేవంత్​

సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు. పెద్దలుగా సహకరించాలని కోరామని తెలిపారు. రైతు మేలు జరిగే నిర్ణయాలు.. ప్రోత్సహించడానికి మాతో చేరారు. సీనియర్ లతో సమానమైన గౌరవం ఇస్తామన్నారు. నిజామాబాద్ లో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు లు పూర్తి చేస్తామన్నారు. పోచారం మాకు అండగా నిలవడటానికి ముందుకు వచ్చారని తెలిపారు. ఇవాళ కేబినెట్ లో రైతు ఋణమాఫీ పై నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయం దండగ కాదు.. పండగ అని చెప్పే నిర్ణయాలు కేబినెట్ లో చర్చ చేస్తామన్నారు. సింగరేణి వేలం పై రేపు స్పందిస్తామన్నారు. ఇవాళ కేవలం రైతుల అంశంపై నే స్పందిస్తామని క్లారిటీ ఇచ్చారు. వ్యవసాయం పండగ చేసే బాధ్యత మాదని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.

Read also: CM Revanth Reddy: కాంగ్రెస్​ లోకి రండి.. పోచారంను ఆహ్వానించిన సీఎం రేవంత్​

పోచారం మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పడి పదేళ్లు పూర్తి అయ్యిందని తెలిపారు. రేవంత్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. రేవంత్ ని నేనే ఇంటికి ఆహ్వానించా అన్నారు. రైతు పక్షపాత నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపారు. రైతుల కష్టాలు తీరాలని.. కాంగ్రెస్ లోకి వచ్చా అని తెలిపారు. ఆరు నెలల పాలన చూశామన్నారు. చిన్న వయసులోనే అన్ని సమస్యలు అవగాహన చేసుకుంటున్నారని తెలిపారు. రాజకీయంగా నేను ఏం ఆశించడం లేదన్నారు. రైతు బాగుండాలి అనేదే నాకు ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వానికి చేదోడు వాదోడు గా ఉంటా అని క్లారిటీ ఇచ్చారు. టీఆర్ ఎస్ కంటే ముందు నేను టీడీపీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నా రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే మొదలైందన్నారు. ఒక్కొక్కరి అభిప్రాయం.. ఒక్కోలా ఉంటుందన్నారు.
Thalapathy 69 : కార్తీక్ సుబ్బరాజు మూవీ కోసం విజయ్ భారీ రెమ్యూనరేషన్..?