NTV Telugu Site icon

Revanth Reddy: నేడు నాలుగు నియోజకవర్గాల్లో రేవంత్‌ రెడ్డి పర్యటన.. రోడ్ షో పాల్గొననున్న టీపీసీసీ

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: ఒకవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇకపై ప్రతిరోజు కేవలం 3 అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం అవుతున్న ఈ ప్రచారం కాంగ్రెస్ వర్గాలలో ఉత్సాహాన్ని పెంచుతోంది. ఈరోజు కూడా రేవంత్ నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. నరసపూర్, పరకాల, ఖైరతాబాద్, నాంపల్లిలో జరిగే బహిరంగ సభల్లో రేవంత్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నర్సాపూర్, 3 గంటలకు పరకాల, సాయంత్రం 6 గంటలకు ఖైరతాబాద్, రాత్రి 8 గంటలకు నాంపల్లిలో జరిగే రోడ్ షోలు, సభల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న రేవంత్. కాగా ఇవాళ భారీ బహిరంగ సభా స్థలిని కాంగ్రెస్‌ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని నేతలకు సూచించారు. సభను విజయవంతం చేయాలని అన్నారు. నేతలంగా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.

Read also: IND vs AUS Final 2023: ఛేదనలో నా గుండె దడ పెరిగింది: ప్యాట్‌ కమిన్స్

ఇక మరోవైపు.. సీఎం కేసీఆర్ సభలను సాకుగా చూపి ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు, అభ్యర్థులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో దూకుడు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 21న ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలకు హాజరై ప్రసంగించేందుకు సిద్ధమవుతున్నారు. ఉదయం వనపర్తి నియోజకవర్గ కేంద్రంలో ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేఘారెడ్డికి మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్యే అభ్యర్థి కూచిపూడి రాజేష్ రెడ్డికి మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అదే రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న డాక్టర్ సీకుడు వంశీకృష్ణకు మద్దతుగా అచ్చంపేటలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొనే బహిరంగ సభలను జయప్రదం చేసేందుకు అభ్యర్థులు, పార్టీ నేతలు పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
OTT Release Movies: ఈ వారం ఓటీటిలో 24 సినిమాలు రిలీజ్.. ఆ సినిమాలు స్పెషల్..!