సీఎం కేసీఆర్ పై మరోసారి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మూడు చింతలపల్లి గ్రామాన్ని కెసిఆర్ దత్తత తీసుకొని ఏం చేయలేదని మండిపడ్డ రేవంత్ రెడ్డి.. అలాంటి ది తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. అందుకే మూడు చింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష పెట్టనున్నామని తెలిపారు. ఈ దీక్ష తో కెసిఆర్ గ్రామానికి ఎం చేశాడో ప్రజలకి చూపిస్తామన్నారు. దీక్ష సమయంలో నైట్ దళితుల ఇంట్లోనే పడుకుంటానని తెలిపారు. ఈటెల రాజేందర్ బీజేపీ లో చేరిన తరువాత అయన పై విచారణ జరిగిందా ..? దళితుల భూములు దోచుకున్నాడు అనే కదా ఆయనను బర్తరఫ్ చేసారని గుర్తు చేశారు. ఈటెల అక్రమాల పై ఇద్దరు స్పెషల్ ఆఫీసర్ల తో వేసిన టీం ఏం చేస్తుందని మండిపడ్డారు. హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక దామోదర రాజనరసింహ కమిటీ చూసుకుంటుందన్నారు.
దత్తత గ్రామానికే చేయలేదు.. తెలంగాణకు ఏం చేస్తాడు ; రేవంత్
