NTV Telugu Site icon

Revanth Reddy: TSPSC పేపర్ లీక్ కేసుని.. పనోళ్లతో క్లోజ్ చేసే కుట్ర చేస్తున్నారు

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy Shocking Comments On TSPSC Paper Leak Case: TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. TSPSC తాళాల గుత్తి ఆంధ్రోడి చేతిలో పెట్టారని, సిట్ విచారణ అధికారి AR శ్రీనివాస్ కూడా ఆంధ్రవాడేనని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం విద్యార్ధి ఉద్యమమని, 30 లక్షల నిరుద్యోగుల గోస పట్టదా? అని మండిపడ్డారు. విచారణ సరిగ్గా జరగాలని కోరినందుకు తనకు నోటీసులు పంపారన్నారు. సిట్ అధికారి ఆంధ్ర అధికారి అయినప్పుడు రిపోర్ట్ ఎలా ఉంటుంది? ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లంతా ఎక్కడ పోయారని నిలదీశారు. సిట్ ద్వారా TSPSC లీకేజ్ పూర్తిగా బయటపడదని.. సిట్ అంటే సిట్ & స్టాండ్ మాత్రమేనని ఆరోపించారు.

RRR: ఆ ‘పెయిడ్’ కౌంటర్ వాళ్ళకేనా సర్?

గతంలో సిట్ వేసిన కేసులన్నీ ఎక్కడపోయాయని.. డ్రగ్స్, నయీమ్ ల్యాండ్ , గోల్డ్ స్టోన్ ప్రసాద్, హౌసింగ్ బోర్డు, ఎమ్మెల్యే కొనుగోలు అంశం వంటివి కేసుల విచారణలు ఏమైపోయాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటివరకు భర్తీ చేసిన ఉద్యోగాల డీటెయిల్స్‌ని పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని తాము కోర్టులో కోరామన్నారు. గంటసేపు కోర్టులో వాదనలు జరిగాయని, ఇద్దరి తరుఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారని వివరించారు. కోర్టులో ప్రాసెస్ మొదలైందని, మూడు పేజీల రిపోర్ట్ రాశారని, ఇప్పటిదాకా సిట్ విచారించిన విషయాలు తమకు కూడా తెలపాలని కోరామన్నారు. సిట్ రిపోర్ట్ కోర్టుకు సడ్మిట్ చేయడంతో పాటు తమకు కూడా ఇవ్వాలని కోరామని తెలిపారు. పేపర్ లీకేజ్ అంశం ప్రవీణ్, రాజశేఖర్‌లకే పరిమితం కాదని.. చైర్మన్, సెక్రెటరీలు, శంకర్ లక్ష్మిలను బాధ్యులుగా చేర్చాలని డిమాండ్ చేశారు.

Faria Abdullah: యాక్టింగ్ మాత్రమే కాదు అంతకు మించి!

TSPSCలో ఉన్న సిస్టమ్‌లకు భాద్యులు ఐటీ శాఖ పరిధిలోనిదేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఐటీ యాక్టు ప్రకారం.. అడిట్, స్క్రూటినీ చేయాల్సింది వారేనన్నారు. పిరియాడికల్ అడిట్ చేయాలని కోరారు. ఓనర్ చైర్మన్, సెక్రెటరీ అయితే.. కాపలాదారు శంకర్ లక్ష్మి అని.. పనోళ్లు ప్రవీణ్, రాజశేఖర్‌లని చెప్పారు. ఈ కేసుని పనోళ్లతో క్లోజ్ చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఐటీ అంత కేటీఆర్ చేతిలోనే ఉంటుందని.. కానీ కేటీఆర్ తెలివిగా తన పరిధి కాదని తప్పించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చింది ఇందుకేనా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు.

Show comments