Site icon NTV Telugu

Revanth Reddy: మోడీ అలా చేశారు కాబట్టే.. సభకు రాజగోపాల్, వివేక్, విజయశాంతి హాజరు కాలేదు

Revanht Reddy

Revanht Reddy

Revanth Reddy: ప్రధాని మోడీ తెలంగాణను వ్యతిరేకించారు కాబట్టే రాజగోపాల్, వివేక్, విజయశాంతి హాజరు కాలేదని ప్రజలు అనుకుంటున్నారని టీపీసీసీ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ సభను ఏర్పాటు చేసిన బిజెపి నాయకులు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ పర్యటనకు పరోక్షంగా కేసీఅర్ సర్కార్ సహకరించిందని అన్నారు. మిషన్ భగీరథ ,కాళేశ్వరం అవినీతి ,సింగరేణి దోపిడీ, లిక్కర్ స్కాం పై ఎందుకు మోడీ మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. అవినీతిపై చర్యలు తీసుకుంటామని మోడీ ఎందుకు అనలేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. BRS ను గెలిపించేందుకు బిజెపి పన్నాగం అని కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ బలంగా ఉన్న చోట మోడీతో సభలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు మోడీ తెలంగాణలో పర్యటన అన్నారు. బిల్లా రంగా లు చేరో దిక్కు తిరుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకడు ఈ దేశంలో ఉండే వాడు కాదు…అమెరికాలో చిప్పలు కడిగిండో లేదు తెలియదన్నారు. కాంగ్రెస్ విధానాల గురించి బిల్లా రంగా లు మాట్లాడతున్నారని అన్నారు. 2004 నుంచి 2014 మధ్య ఉమ్మడి ఏపిలో కాంగ్రెస్ ఆరు హామీలను అమలు చేశామన్నారు. ఉమ్మడి ఎపిలో అమలు చేసిన పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినమా? బిల్లా రంగా లకు సవాల్ విసురుతున్న.. 2014 నుంచి కేసీఅర్ ఇచ్చిన హామీలు , BRS మ్యానిఫెస్ట్ ల పై మీరు చర్చకు సిద్ధమా ? అని ప్రశ్నించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అమలు చేసిన హామీలపై చర్చకు మేము సిద్ధమన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉందని సన్నాసి లాజిక్ లు వద్దుని వ్యంగాస్త్రం వేశారు.

కాంగ్రెస్ లో బహుళ నాయకత్వం ఉంటే మంచిదే కదా ? అన్నారు. రాజస్థాన్ , ఛత్తీస్ ఘడ్ లో అయిదేళ్ళు ఒకే సిఎం ఉన్నారు కదా ? అని గుర్తు చేశారు. ప్రజలు బండకేసి కొడితే కవిత , వినోద్ రావు లకు మూడు నెలలకే పదవులు ఇచ్చారని తెలిపారు. బిల్లా రంగా లు సిగ్గు తప్పిన మాటలు మాట్లాడవద్దని మండిపడ్డారు. సోనియా గాంధీ ప్రకటించిన అరు గ్యారెంటీ లను కాంగ్రెస్ అమలు చేస్తుంది తెలంగాణలో అని హామీ ఇచ్చారు. ఓట్ల కోసం NTR పేరును BRS వాడుకుంటుందని మండిప్డడారు. NTR పేరు నా పేరు ఒకటే అని కేటీఆర్ అంటున్నాడు. నక్కకు కుక్కకు ఉన్న తేడా పోల్చుకొకు కేటీఆర్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. NTR ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రోజు ఆయన కుటుంబ సభ్యులు సచివాలయం రాలేదన్నారు. కానీ కేసీఆర్ కుటుంబసభ్యులు దోచుకుంటున్నారని అన్నారు.
Kotamreddy Sridhar Reddy: కాకాని అధికారంలో ఉండేది మూడు నెలలు మాత్రమే..

Exit mobile version