Site icon NTV Telugu

Revanth Reddy: సీఎంవోలో పెత్తనం జగ్గారెడ్డిది.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నా..

Revanthreddy

Revanthreddy

Revanth Reddy: సీఎం కార్యాలయంలో పెత్తనం మొత్తం జగ్గారెడ్డిది అని.. రబ్బర్ స్టాంపు లా నేను పని చేస్తున్ననని, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్న అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్ళకి ఒకటే పిచ్చి పట్టుకున్నదన్నారు. మనకి పిచ్చి లేపి కత్తులతో పొడుచుకునేటట్టు చేస్తున్నారన్నారు. గాడిద గుడ్డు ఇచ్చిన బిజెపికి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. బీజేపీ మాయలో పడితే, వాళ్ళు అధికారంలో వస్తే రాజ్యాంగం మారుస్తారన్నారు. ఎస్సి, ఎస్టీ, బిసి రిజర్వేషన్లు తీసేస్తారన్నారు. సీఎం కార్యాలయంలో పెత్తనం మొత్తం జగ్గారెడ్డిది అన్నారు. నీలం మధుని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దించిందన్నారు. నీలం మధుకి పటాన్ చెరు నుంచి 50 వేల ఓట్ల మెజారిటీ ఇవ్వాలని తెలిపారు. నీలం మధు, కాట శ్రీనివాస్ జోడెద్దులు, రామలక్ష్మణుల్లా పని చేయండన్నారు.

Read also: D. Sridhar Babu: పేదవారికి అన్యాయం జరిగితే సహించేది లేదు..

దేశం సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుందని తెలిపారు. ఈ సారి లోక్ సభ ఎన్నికలు రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలన్న కుట్రతో జరుగుతున్నాయని తెలిపారు. అంబేద్కర్ ఇచ్చిన అవకాశాన్ని బిజెపి రద్దు చేయాలని కుట్రలు చేస్తుందన్నారు. మన మధ్య గొడవలు పెట్టి లాభపడాలని బీజేపీ చూస్తుందని తెలిపారు. ఇందిరాగాంధీ మెదక్ ఎంపీగా గెలిచి ప్రధాని అయ్యాక ఇక్కడ అనేక పరిశ్రమలు వచ్చాయన్నారు. ఈ పటాన్ చెరు మినీ ఇండియా… దేశంలో ఎన్ని భాషలు, కులాలు ఉన్నాయో అందరూ ఇక్కడే కలిసి మెలిసి ఉన్నారన్నారు. చట్ట సభల్లో మాట్లాడలన్న, ఢిల్లీలో మన సమస్యలపై మాట్లాడలన్న నీలం మధు గెలవాలన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చేసిందో, 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుందన్నారు.

Read also: JP Nadda: ఏపీలో కూటమి గెలవబోతోంది.. జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు

ఈ సారి నిలబడ్డ అభ్యర్థులు ఎవరు కొత్తవాళ్ళు కారన్నారు. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ భూ నిర్వాసితులను పోలీసులతో తొక్కించిన వ్యక్తి వెంకట్రామిరెడ్డి అన్నారు. తెల్లపూర్ లో అక్రమ ఆస్తులు సంపాదించిన వెంకట్రామిరెడ్డి.. కేసీఆర్, హరీష్ రావులకు వేల కొట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఉంది అయినా ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. మందిని ముంచినా సొమ్ముతో ఇచ్చింది తీసుకోండి తూర్పు కి తిరిగి దండం పెట్టమని చెప్పాలన్నారు. మోడీ, అమిత్ షా తెలంగాణకి వచ్చారన్నారు. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు తెలంగాణ కి ఏమైనా ఇస్తారేమో అనుకున్నా అని తెలిపారు. పటాన్ చెరు వరకు మెట్రో, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ,ITIR ఇస్తారేమో అనుకున్నాఇదేమి ఇవ్వలేదన్నారు. ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే మనకు పెట్టుబడులు వస్తాయన్నారు. బీజేపీ మాత్రం గొడవలు పెట్టాలని చూస్తుందన్నారు.
Bandi Sanjay: మోడీ లేకపోతే.. భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం..

Exit mobile version