Site icon NTV Telugu

Revanth Reddy: బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో.. రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy Letter

Revanth Reddy Letter

Revanth Reddy: బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో అని తెలంగాణ రాష్ట్ర స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిజ ప్రజాప్రతిందుల దుస్థితిపై లేఖలో వివరించారు. జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాకు స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత తెలుసని అన్నారు. ఏ ప్రభుత్వ పాలన కైనా మీరే పునాదులు అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ అవస్థలు.. మీకు జరిగిన అవమానాలు నాకు తెలుసన్నారు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కేసీఆర్ పురుగులకంటే హీనంగా చూశారని తెలిపారు. నిర్ణయాధికారం లేక, నిధులు రాక మీరు పడిన బాధలు గుర్తున్నాయని రేవంత్ తెలిపారు. సర్కారు నిధులు రాకున్నా భార్య మెడలో బంగారం అమ్మి అభివృద్ధి చేసిన వాళ్లు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఊరి కోసం అప్పుచేసి వడ్డీలు కట్టలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు ఉపాధి హామీ కూలీలుగా, వాచ్ మెన్ లుగా చేస్తున్నారని గుర్తు చేశారు.

Read also: Vanitha Vijay Kumar: బిగ్ బాస్ కాంట్రవర్సీ… అర్ధరాత్రి నటిపై దాడి

బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో అన్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 30న ఎన్నికలు జరగబోతున్నాయని, ఈ ఎన్నికల్లో మీ పాత్ర అత్యంత కీలకం అన్నారు. పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టండి.. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇదొక అవకాశం అన్నారు. రేపటినాడు మీ కష్టాలు తీర్చి, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని తెలిపారు. స్థానిక సంస్థలకు పూర్వవైభవాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఇక బీఆర్ఎస్-కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదాం అని పిలుపు నిచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు మీ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మీ పల్లె రుణం తీర్చుకునే అవకాశం కాంగ్రెస్ ఇస్తుందని, పార్టీలకు, జెండాలకు, ఎజెండాలకు అతీతంగా… వార్డు సభ్యుడు నుంచి సర్పంచ్ వరకు.. కౌన్సిలర్ నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు…కార్పొరేటర్ నుంచి మేయర్ల వరకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని రేవంత్ అన్నారు.

Exit mobile version