NTV Telugu Site icon

Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు వివాదం.. ఐఏఎస్ అధికారి నోటీసుకు రేవంత్ రియాక్షన్‌

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించి మే 25న ఐఏఎస్ అధికారి ఇచ్చిన లీగల్ నోటీసులను ఉపసంహరించుకోవాలి. అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ అక్రమాలను ప్రశ్నించినందుకు అణచివేసేందుకు ఈ నోటీసు పంపినట్లు తెలిపారు. లీగల్ నోటీసులో పేర్కొన్న ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. ఓఆర్ఆర్ టెండర్ విషయంలో అరవింద్ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారు. అడిగిన సమాచారం ఇవ్వకుండా రాజకీయ నాయకుడిలా దాడులు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ఆదాయం వచ్చే ఆస్కారం ఉన్నా ఆ దిశగా ఆలోచన చేయడంలేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి కేవలం రూ.7380 కోట్లకే ఐఆర్బీ సంస్థకు 30 ఏళ్లకు ఓఆర్ఆర్ టోల్ వసూలు టెండర్ అని అన్నారు. ఐఆర్బీ సంస్థకు టెండర్ కట్టబెట్టే క్రమంలో యదేచ్ఛగా నిబంధనల ఉల్లంఘించారని మండిపడ్డారు. ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా బేస్ ప్రైస్ పై అరవింద్ కుమార్ నుంచి ఎటువంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఆర్ఆర్ పై ట్రాఫిక్, టెండర్ విలువను మదింపు చేసిన మజర్స్ నివేదికను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ అధికారి స్థానంలో ఒక రిటైర్డ్ ఆఫీసరును నియమించి ఓఆర్ఆర్ టెండర్ టెండర్ ప్రక్రియను పూర్తి చేశారని అన్నారు. ఎన్ని నోటీసులిచ్చినా ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటానని అన్నారు.

Read also: MRF First Indian Stock: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎంఆర్ఎఫ్ అరుదైన రికార్డు

ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లీజుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన నిరాధార ఆరోపణలను హైదరాబాద్‌ మహా నగర్‌ అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సీరియస్‌గా తీసుకుంది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసు అందిన 48 గంటల్లోగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. లోక్‌సభ సభ్యుడిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఏం మాట్లాడినా ప్రజల్లోకి విస్తృతంగా వెళుతుంది కాబట్టి చేసే ప్రతి ప్రకటన, మాట్లాడే మాటకు బాధ్యత ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఓఆర్‌ఆర్‌ను లీజుకు తీసుకున్నట్లు హెచ్‌ఎండీఏ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 9న టీవీఓటీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందని, అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించేందుకు టెండర్ల ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగిందని అధికారులు తెలిపారు. అత్యధిక బిడ్ దాఖలు చేసిన ఐఆర్ బీ ఇన్ ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ కు లీజు ఖరారు చేస్తూ ఏప్రిల్ 27న లెటర్ ఆఫ్ అవార్డ్ ఇచ్చామని వివరించారు. టెండర్ ప్రక్రియకు సంబంధించిన పత్రాలు, ఐఆర్‌బి ఇన్‌ఫ్రాకు జారీ చేసిన పత్రాలు మరియు ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఓఆర్‌ఆర్‌ లీజుపై ప్రజలకు అన్ని విధాలుగా సమాచారం ఉన్నప్పటికీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పటికీ దానిపై రేవంత్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని నోటీసుల్లో హెచ్‌ఎండీఏ ఆరోపించింది.
Central Govt on Twitter : ట్విట్టర్ మాజీ సీఈఓ ఆరోపణలు అబద్ధం : కేంద్ర మంత్రి

Show comments