NTV Telugu Site icon

Revanth Reddy: నిజాం రాజు అంతక్రియలను తప్పుపట్టే వారు మానసిక అంగవైకల్యం కలవారు

Revanthreddy

Revanthreddy

Revanth Reddy paid tribute to Mukharam Jha body: నిజాం రాజు అంతక్రియలను ప్రభుత్వం అధికార లాంఛనాలతో జరిపించడాన్ని తప్పుపట్టే వారు మానసిక అంగవైకల్యం కలవారని భావించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పాతబస్తీలో ఉన్న చౌమహల్లా ప్యాలెస్‌లో ఎనిమిదో నిజాం బర్కత్‌ అలీఖాన్‌ ముకరం ఝా బహదూర్‌ పార్థివదేహానికి రేవంత్‌ రెడ్డి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్దిస్తుందని తెలిపారు. నిజాం రాజులు సృష్టించిన సంపదను తెలంగాణ ప్రభుత్వం అమ్మేస్తుందని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలో విలువైన భూములను వేలానికి పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అందరు గర్వించేలా ఓ గొప్ప పనికి శ్రీకారం చుట్టాలని, దానికి ముకరంజా పేరు పెట్టాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. ఎలాంటి కార్యక్రమం చేపట్టాలనే విషయాన్ని అసెంబ్లీలో ప్రభుత్వం అందరితో చర్చించాలని అన్నారు.

Read also: Uppal Stadium: ఉప్పల్ స్డేడియంకు వెళ్తున్నారా? అయితే ఇవి తప్పనిసరి

నిజాం కాలంలో రాజులు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని తప్పులు కూడా జరిగాయని, వాటిని కాంగ్రెస్ పార్టీ సమర్దించదని తెలిపారు. 8వ నిజాం రాజు మరణించడం బాధాకరమన్నారు రేవంత్‌ రెడ్డి. నిజాంరాజులు హైదరాబాద్ ను ఎంతో వృద్ధి చేశారని గుర్తుచేశారు. చార్మినార్ ఏరియాలో అనేక బిజినెస్ లు చేసుకోవడానికి సౌకర్యాలు కల్పించారని అన్నారు. ఉస్మానియా, నిలోఫర్, కోరంటి, దవఖానాలు, ఉస్మానియా కాలేజీ నిర్మాణం చేసిన ఘనత నిజాం రాజులదని రేవంత్‌ తెలిపారు. 220 ఏళ్లు హైదరాబాద్ ను పాలించారని అన్నారు. హెల్త్ కు, ఎడ్యుకేషన్ కు నిజాంలు పెద్దపీట వేశారన్నారు. నిజాంరాజు కాలంలోనే అసెంబ్లీ నిర్మాణం చేశారని తెలిపారు.

Read also: MLAs Purchase Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై మరోసారి హైకోర్టులో విచారణ

టర్కీలోని ఇస్తాంబుల్‌ లో ఎనిమిదో నిజాం బర్కత్‌ అలీఖాన్‌ ముకరం ఝా బహదూర్‌ గత శనివారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే.. ఆయన చివరి కోరిక మేరకు ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌ లో నిర్వహించనున్నారు. ఎనిమిదో నిజాం భౌతిక కాయాన్ని ఆయన తండ్రి అజమ్‌ ఘా సమాధి పక్కనే ఖననం చేయనున్నారు. ముకరం ఝా బౌతిక కాయాన్ని ఇస్తాంబుల్‌ నుంచి నిన్న సాయంత్రానికి ప్రత్యేక విమానంలో నగరానికి తీసుకువచ్చి.. అక్కడి నుంచి పాతబస్తీలో ఉన్న చౌమహల్లా ప్యాలెస్‌లో ఉన్న పార్థివదేహాన్ని ఉంచారు. ఇవాళ మధ్యాహ్నం వరకు సాధారణ ప్రజలకు ఆయన భౌతిక కాయాన్ని చూసే అవకాశం కల్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మక్కా మసీదుకు తరలిస్తారు. ముకర్రమ్ ఝా కోరిక మేరకు ఆయన తండ్రి అజమ్ ఝా సమాధి పక్కనే అంత్యక్రియలు చేస్తారు. కాగా.. మక్కా మసీదులోనే దక్షిణ భాగంలో అజమ్ ఝా సహా అసఫ్ జాహీ కుటుంబ సభ్యుల సమాధులు ఉన్నాయి..అక్కడే ముకరం ఝా భౌతిక కాయాన్ని కూడా ఖననం చేయనున్నారు.
Amala Paul: హీరోయిన్ ని గుడిలోకి రానివ్వని పూజారులు…