NTV Telugu Site icon

Revanth reddy: రేపటి నుంచే రేవంత్ రెడ్డి పాదయాత్ర.. పూర్తి షెడ్యూల్ విడుదల

Revanthreddy

Revanthreddy

Revanth reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే లక్ష్యంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టిన హాత్‌ సే హాత్ జోడో పాదయాత్ర మొదటి రెండు రోజుల షెడ్యూల్ ను ములుగు ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు. రేవంత్‌ రెడ్డి ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మల సన్నిధానం నుంచి సోమవారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తదితర ముఖ్యనేతలు వేర్వేరు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అయితే.. రాహుల్‌ గాంధీ సందేశాన్ని రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేర్చేందుకే ఏఐసీసీ ఈ కార్యక్రమాన్ని నిర్దేశించిందని అన్నారు. పార్టీ నాయకులంతా దీన్ని సమన్వయంతో అమలు పరుస్తారని పేర్కొన్నారు. కాగా.. మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పది రోజులపాటు సాగే యాత్రలో తాను పాల్గొంటున్నట్లు చెప్పారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతోపాటు బందోబస్తు కల్పించాలంటూ ఎమ్మెల్యే సీతక్క ములుగు ఎస్పీ గౌస్‌ ఆలంను కోరారు.

Read also: Rashmi Gautam: ఆకుల చున్నీతో ఆకట్టుకుంటున్న రష్మీ

రెండు రోజుల షెడ్యూల్‌ ఇదే..

* రేపు ఉదయం 11 గంటలకు ములుగు జిల్లా సమ్మక్క, సారలమ్మ తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి రేవంత్‌ రెడ్డి చేరుకుంటారు.

* ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సమ్మక్క, సారలమ్మ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లను దర్శించుకుంటారు.

* మధ్యాహ్నం 1 గంటకు మేడారం గుడి నుంచి పాదయాత్ర బయలుదేరి తాడ్వాయి మండలంలోని కొత్తూరు, నార్లాపూర్‌, వెంగ లాపూర్‌ గ్రామాల మీదుగా గోవిందరావు పేట మండలంలోని ప్రాజెక్టు నగర్‌ గ్రామానికి

* మధ్యాహ్నం 2 గంటల వరకు చేరుకుంటుందని సీతక్క తెలిపారు.

* అదే రోజు 2 నుంచి 2.30 గంటలకు ప్రాజెక్టు నగర్‌లోనే భోజన విరామం ఉంటుంది.

* అనంతరం 2.30 గంటలకు ప్రాజెక్టు నగర్‌ నుంచి బయలుదేరి పాదయాత్ర సాయంత్రం 4.30 గంటలవరకు పస్రా గ్రామానికి చేరుకుంటుంది.

* సాయంత్రం 4.30 నుంచి 5 గంటల వరకు టీ విరామం ఉంటుంది.

* సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు పస్రా జంక్షన్‌లో కార్నర్‌ మీటింగ్‌ నిర్వహిస్తారు.

* సాయంత్రం 6 గంటలకు పస్రా గ్రామం నుంచి గోవిందరావుపేట, చల్వాయి, మచ్చాపూర్‌ మీదుగా వెంకటాపూర్‌ మండలంలోని జవహర్‌నగర్‌, జంగాలపల్లి క్రాస్‌, ఇంచర్ల, వెంకటాపూర్‌ క్రాస్‌రోడ్‌ మీదుగా పాలంపేటకు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.

* ఎల్లుండి (మంగళవారం) 7న ఉదయం 8 గంటలకు పాలంపేట రామప్ప దేవాలయంలో శ్రీ రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహిస్తారని తెలిపారు.

* ఉదయం 8.30 గంటలకు పాలంపేట గ్రామం నుంచి బయలుదేరి రామంజపురం, చెంచుకాలనీ, నారాయణగిరిపల్లె మీదుగా బుద్దారం గ్రామానికి

* మధ్యాహ్నం 1.30 వరకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది.

* మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి బుద్దారం గ్రామం నుంచి కేశవాపూర్‌, నర్సాపూర్‌, బండారు పల్లి మీదుగా సాయంత్రం 6 గంటలవరకు ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు.

* సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటలకు జిల్లాకేంద్రంలోని గాంధీ పార్క్‌ వద్ద కార్నర్‌ మీటింగు ఉంటుందని సీతక్క తెలిపారు.
Traffic restrictions: నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. దారి మళ్లిస్తారు ఇలా..