పీజేఆర్ కుమారుడు విష్ణు ఇంటికి ఇవాళ రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పీజేఆర్ చరిత్రను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అంటే పీజేఆర్.. పీజేఆర్ అంటే కాంగ్రెస్ అనిపించారని.. సీఎల్పీ నేతగా అప్పటి ప్రభుత్వాలను గడగడలాడించారని.. హైదరాబాద్ కు కృష్ణా జలాల కోసం పీజేఆర్ పోరాటం చేశారని పేర్కొన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో నీటి సమస్య పరిష్కారం.. పీజేఆర్ వల్లే సాధ్యమైందన్నారు. బస్తీలలో ఇప్పటికీ పీజేఆర్ అంటే ప్రేమ ఉందని… తెలంగాణలో పీజేఆర్ పేరు తెలియని వారు లేరని కొనియాడారు.
read also : సీఎం జగన్ తండ్రి నిమించిన తనయుడు : సజ్జల
పోతిరెడ్డిపాడు మీద.. మొదట పోరాటం చేసింది పీజేఆర్.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పోరాటం చేశారని తెలిపారు. కృష్ణా జలాల అక్రమ తరలింపును శాయశక్తులా పోరాడారని.. పీజేఆర్ చనిపోయిన తర్వాత తెలంగాణ తరపున బలంగా పోరాడే నేత లేకపోయారని వెల్లడించారు. కృష్ణా జలాల విషయంలో కొట్లాట వల్లే..పీజేఆర్ ను వైఎస్సార్ కేబినెట్ లోకి తీసుకోలేదని… పోతిరెడ్డిపాడు తెలంగాణ పట్ల మరణ శాసనం అని ఆనాడు పీజేఆర్ చెప్పారని గుర్తు చేశారు. పీజేఆర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే.. విష్ణుకి అండగా నిలబడాలన్నారు. విష్ణు కట్టె పట్టుకుంటే.. హైదరాబాద్ లో ఒక్కడు నిలబడడని పేర్కొన్నారు.
