NTV Telugu Site icon

Revanth Reddy: మహేశ్వరంలో కె.ఎల్.ఆర్ కు 25వేల మెజారిటీ ఖాయం.. ప్రచారంలో రేవంత్ రెడ్డి

Revanth Reddy Klr

Revanth Reddy Klr

Revanth Reddy: మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, 25 వేల మెజారిటీతో కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గెలవబోతున్నారని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్ కె పురం అష్టలక్ష్మి కమాన్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్ హాజరైన రేవంత్ రెడ్డికి మహేశ్వరం కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికి, గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీ ఆర్ ఎస్ లో చేరిన సబితా ఇంద్రారెడ్డి కి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులకు,నియోజకవర్గ ప్రజలకు ఉందని తెలిపారు. కె ఎల్ ఆర్ వంటి నాయకులు అసెంబ్లీలో ఉండాలని, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు తో తెలంగాణ లో కాంగ్రెస్ కు బలం చేకూరి తెలంగాణ లో కూడా అధికారంలోకి రావడం ఖాయం అనిఅన్నారు.

ఈ నెల 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన సోనియమ్మకు జన్మదిన కానుక ఇచ్చేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చెనగిరి లక్ష్మారెడ్డి అన్నారు. మహేశ్వరం అభివృద్ధి బాధ్యత రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనన్నారు. గతంలో కూడా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం దళితులు అసెంబ్లీలో గళం విప్పారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యంతో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరిగిందని, కాంగ్రెస్‌లో భాజపా, భార్స పార్టీల భారీ భాగస్వామ్యంతో బల నిరూపణకు సిద్ధమైందన్నారు. లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. గెలుపే ధ్యేయంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగుతున్నారన్నారు.

మహేశ్వరం నియోజకవర్గానికి పరాభవం కలిగించిన సబితమ్మను పూర్తిగా ఓడించాలని సూచించారు. పార్టీ ప్రకటించిన ఆరు హామీలను ప్రజలతో మమేకం చేస్తూ ప్రజలకు చేరవేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంటే చూడలేక బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. హస్తం పార్టీ సృష్టించిన సునామీలో బీఆర్‌ఎస్, బీజేపీలు ఓడిపోయాయని, మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని సంతోషం వ్యక్తం చేశారు. మహేశ్వరంలో అభివృద్ధి కనిపించడం లేదని, నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, బరస అభ్యర్థి సబితమ్మకు సవాల్ విసిరారు.
Mitchell Marsh FIR: ఢిల్లీలో మిచెల్‌ మార్ష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. టీమిండియాపై ఆడుకుండా జీవితకాల నిషేధం..!