NTV Telugu Site icon

Tspsc paper leak case: 6వ రోజుకు చేరిన విచారణ.. నేడు సిట్‌ ముందుకు రేవంత్‌ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

Tspsc paper leakcase: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ లో సిట్ విచారణ రాజకీయ పులుము అందుకుంది. ఇవాల హిమాయత్ నగర్ సిట్ కార్యాలయానికి నేడు 6వ రోజు 9మంది నిందితుల విచారణ చేయనున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ లో సిట్ విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సిట్ ఈ కేసులో ముగ్గురిని ఎఫ్.ఐ.ఆర్ కాపీ నిందితుల జాబితాలో చేర్చింది. గ్రూప్ 1 రాసి టాప్ మార్క్స్ సాధించిన రమేష్, షమీమ్, సురేష్ లను సిట్ అదుపులో తీసుకుంది. రమేష్ tspsc ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, షమీమ్ tspsc శాశ్విత ఉద్యోగి… సురేష్ గతంలో tspsc టెక్నికల్ సెక్షన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసి బయటకు వెళ్లినట్లు సిట్ గుర్తించింది. దీంతో నిందితులు సంఖ్య మొత్తం 12కు చేరుకుంది. గ్రూప్ 1 పరీక్షలో 103 మందికి 100 కి పైగా మార్కులు వచ్చినట్లు గుర్తించారు. టీఎస్‌పీఎస్‌సీలో పని చేస్తున్న 42 మందికి సిట్ నోటీసులు జారీ చేసింది. నేడు మరోసారి శంకర్ లక్ష్మిని సిట్ విచారించనుంది.

Read also: Imran Khan: నన్ను చంపేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది..

పేపర్ కస్టోడియన్ శంకరలక్ష్మి సిస్టమ్ పాస్ వర్డ్ ను దొంగిలించినట్లు నిందితులు తొలుత వెల్లడించారు. అయితే.. నిన్న శంకరలక్ష్మి నుంచి సిట్ అధికారులు వాంగ్మూలం తీసుకోగా తాను ఎక్కడా పాస్‌వర్డ్‌ రాయలేదని వెల్లడించింది. ఇక చివరకు విచారణలో అడ్మిన్ రాజశేఖర్ ఆమె సిస్టమ్‌ను హ్యాక్ చేసి ఐటీ యాక్ట్‌ను జోడించినట్లు పోలీసులు నిర్ధారించారు. అంతేకాకుండా.. కొన్ని మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా.. నిందితులతో సంబంధాలు ఉండి సెల్‌ఫోన్లు స్విచ్ఛాప్‌ చేయడం.. నగరం తమ సొంత ఊళ్లను విడిచిపోయినవారు ఎవరు? అనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని వారి వివరాలను సేకరిస్తున్నారు.

Read also: MLC Elections: ఏపీలో నేడు ఎమ్మెల్యే కోట.. ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్

సిట్ కార్యాలయం వద్ద పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఇవాళ 11 గంటలకు సిట్ ఎదుట పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. పేపర్ లీక్ పై తన ఆరోపణల పట్ల ఆధారాలను సమర్పించాలని రేవంత్ కు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
KCR Tour: నేడు 4 జిల్లాల్లో కేసీఆర్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదీ

Show comments