Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర కొనసాగుతుంది. నేడు జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ చిట్యాల, మొగుళ్ళపల్లి మండలాల్లో హాథ్ సే హాథ్ జోడో యాత్ర సాగనుంది. ఉదయం కోటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారిని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతర చల్లగరిగ, జూకల్ గ్రామానికి పాదయాత్ర చేపట్టారు. చల్లగరిగ, జూకల్ రైతులతో మాటా -ముచ్చట కార్యక్రమంలో రేవంత్ మాట్లాడనున్నారు. తిరుమలాపూర్ గ్రామం నుండి మొగుళ్ళపల్లి వరకు యాత్ర సాగనుంది. చిట్యాల, ఏలేటి రామయ్యపల్లి, నవాబుపేట మొగుళ్లపల్లి వరకు యాత్ర కొనసాగి.. అక్కడ సాయంత్రం 5 గంటలకు పబ్లిక్ కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు.
Read also: Nude photo: మహబూబ్ నగర్ లో న్యూడ్ ఫోటోల కలకలం.. తాంత్రిక పూజలతో లైంగిక దాడి
నిన్న హాత్ సే హాత్ జోడో పాదయాత్ర వరంగల్‌లో నిర్వహించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచానికి మేధావులను అందించిన చరిత్ర కాకతీయ యూనివర్సిటీదని, అలాంటి కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు లేవు, ప్రొఫెసర్లు లేని పరిస్థితి అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర మరువలేనిదని, కొండా దంపతుల మీద కోపంతో వరంగల్ ను ఈ దండుపాళ్యం ముఠా చెత్త కుప్పగా మార్చారన్నారు. పౌరుషానికి మారుపేరైన ఈ గడ్డపై బిల్లా రంగా లాంటి ఎమ్మెల్యేలు అవసరమా? వరంగల్ లో ఏ ఎమ్మెల్యే అయినా ప్రజలకు అందుబాటులో ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. ‘వరంగల్ లో బీఆరెస్ నేతలు భూములు ఆక్రమించుకుని దోచుకుంటున్నారు. అజాం జాహీ మిల్లు కార్మికులకు ఇవ్వాల్సిన భూమి ఈ ప్రభుత్వం పంపిణీ చేయలేదు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప వరంగల్ లో ఈ తొమ్మిదేళ్లలో ఏ అభివృద్ధి జరగలేదు.
Dogs Attack: తెలంగాణలో హడలెత్తిస్తున్న కుక్కల దాడులు.. చైతన్యపురిలో ఒకరు, కరీంనగర్‌లో మరొకరు