కేసీఆర్ సర్కార్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆంధ్ర రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మానవ మృగాలుగా మారిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి బాహ్యమైన రాజకీయాలు చేస్తున్నారని… చట్టంలో మద్దతు ధర ఉన్న పంటకు రైతులకు రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. యాసంగిలో వడ్లు వేయాలని.. ఎట్లా కొనడో చూద్దామని స్పష్టం చేశారు.
వడ్లు కొనని వాడు కుర్చీ మీద ఎట్లా కూర్చుంటాడని ఫైర్ అయ్యారు. వండ్లు కొనకపోతే… టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెడతామని హెచ్చరించారు. ఊర్లలోకి వచ్చే… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులను చెప్పుతో కొట్టాలని పిలుపునిచ్చారు. రైతులు వరి వేయద్దన్న కేసీఆర్.. ఆయన భూమిలో మాత్రం వరి వేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పొలాలు బిడులుగా మారాలి… కానీ నీ భూములు పచ్చని పొలం గానే ఉండాలా..? అని నిలదీశారు.
