Revanth Reddy Fires On BJP KCR KTR Harish Rao In Pressmeet: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ధ్వజమెత్తారు. బీజేపీ+బీఆర్ఎస్ = బైబై అంటూ సరికొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. తన నివాసంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. సభను అడ్డుకోవడానికి ప్రభుత్వ అధికారులు ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. కనీసం తాగడానికి నీళ్లు కూడా సరఫరా చేయకపోవడం సిగ్గుచేటంటూ విరుచుకుపడ్డారు.
Lift Harassment: దారుణం.. లిఫ్ట్ పేరుతో బైక్ ఎక్కించుకొని లైంగిక దాడి
ఖమ్మంలో ఉన్న సైకో మంత్రి సైకో విన్యాసాలన్ని చేశాడంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యాలు చేశారు. తమ రాహుల్ గాంధీ పదవులను త్యాగం చేసిన నాయకుడు అని కొనియాడారు. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని పేపర్లు, టీవీలు, ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు రాహుల్ గాంధీని అడ్డుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పర్యటించడానికి రాహుల్ గాంధీ కంటే ఎక్కువ అర్హత ఎవరికి ఉంది? అని ప్రశ్నించారు. ఒకడు పిట్టల దోర, ఒకడు ట్విట్టర్ పిట్ట, ఒకడు సారా పోసే మంత్రి అంటూ విమర్శించారు. టేపు పట్టుకొని ఎంత హైట్ ఉన్నావో కోలుసుకున్నావా మంత్రి? అంటూ ఎద్దేవా చేశారు. కాళేశ్వరంపై హరీష్ రావుతోనైనా, కేటీఆర్‌తోనైనా చర్చకు నేను సిద్ధమని సవాల్ విసిరారు. తన సవాలును కేటీఆర్, హరీష్ స్వీకరిస్తారా? అని నిలదీశారు. కల్వకుంట్ల కుటుంబానికి కాళేశ్వరం ‘వైట్ ఎలిఫెంట్’లాగా మారిందని పేర్కొన్నారు.
Black Magic: బ్లాక్ మ్యాజిక్ పేరుతో భారీ మోసం.. నగదు రెండింతలు చేస్తానని..
ఖమ్మం సభలో రాహుల్ గాంధీ ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే.. ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధమని రేవంత్ తేల్చి చెప్పారు. రాహుల్‌ని విమర్శిస్తే.. కేటీఆర్ ముఖంపై హరీష్.. హరీష్ మొహంపై కేటీఆర్ కాండ్రించి ఉమ్మేసుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. 75 రూపాయలున్న పెన్షన్‌ను రూ.200 చేసింది తామేనని ఉద్ఘాటించారు. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా.. రూ.4000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆదాయం పెరిగిందని, పథకాల్ని ఎలా అమలు చేయాలో తమకు బాగా తెలుసని చెప్పారు. రూ.4000 పెన్షన్‌పై అనుమానాలుంటే.. చర్చ పెట్టాలని, తాము అవగాహన కల్పిస్తామని అన్నారు. కేసీఆర్ అవినీతి ఆపేస్తే.. పథకాలకు డబ్బులు ఇవ్వొచ్చని చెప్పుకొచ్చారు.