Site icon NTV Telugu

దళితుల ఓట్ల కొనుగోలుకే ఇంటికి పది లక్షలు…

revanth reddy

గిరిజనులు అమాయకులే కావచ్చు.. కానీ ఆలోచన లేని వారు కాదు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజనుల కష్టాలను ప్రభుత్వం గుర్తించడం లేదు. హుజూరాబాద్ ఎన్నికల్లో దళితుల ఓట్లు కొనుగోలు చేసేందుకు కేసీఆర్ ఇంటికి పది లక్షలు ప్రకటించాడు అని తెలిపారు. మరి రాష్ట్రం మొత్తం ఎప్పుడు ఇస్తడో ఎందుకు చెప్పట్లేదు. ఈ 7 సంవత్సరాలలో ప్రభుత్వం 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే.. అందులో గిరిజనులకు ఖర్చు పెట్టింది ఎంత. కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లోకి పోయిన ఎమ్మెల్యే లు ఇసుక దోపిడీ చేస్తున్నారు. వాళ్ళే అటవీ సంపదను దోపిడీ చేస్తున్నారు. గిరిజన తండాలకు ఓక్క కొత్త రోడ్డు లేదు. గిరిజన బిడ్డలను చెట్లకు కట్టేసి కొడుతుంటె ..కేసీఆర్ కు కనపడడం లేదా అని ప్రశ్నించారు. పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటుంన్న గిరిజనులను చిత్ర హింసలు పెడుతున్నారు..

దళితులకు పది లక్షల ప్రకటించి నట్లే…గిరిజనులకు పది లక్షలు ప్రకటించాలి. ఆగస్ట్ 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే దలిత ,గిరిజన దండోరా కార్యక్రమంలో ఓక రోజు రాహుల్ గాంధీ. పాల్గొంటారు. కొమరంభీం స్పూర్తితో మరో ఉధ్యమానికి సిద్ధం అవ్వాలి. ఎన్ని నిర్భాందాలు విధించినా లక్ష మంది తో ఇంద్రవెల్లిలో సభ పెట్టి తీరుతాం. లక్షకు ఓక్కరు తక్కువ అయినా.. నీకు గులాంగిరి చేస్తాం. తుడుందెబ్బ అంటె ఉడుం పట్టు అని నిరూపిస్తాం అని పేర్కొన్నారు.

Exit mobile version