Site icon NTV Telugu

కాంగ్రెస్ గరక లాంటిది..ఎండకు ఎండినా…చినుకు పడితే చిగురిస్తుంది : రేవంత్‌

కాంగ్రెస్ పార్టీ గరక లాంటిది.. ఎండకు ఎండినా… చిన్న చినుకు పడితే పచ్చగా చిగురిస్తుందని కొత్త పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ కొత్త పిసిసి టీం సభ్యుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ చరిత్రలో నాలుగు నెలలకు పైగా అభిప్రాయ సేకరణ చేసి పిసిసి నియామకం చేయడం ఇదే మొదటి సారి అని పేర్కొన్నారు. నేను సోనియా గాంధీ మనిషి అని… చిన్న వయసులో.. తక్కువ సమయంలో నాకు పెద్ద అవకాశం ఇచ్చారని తెలిపారు.

read also :తెలంగాణలో భారీగా పడిపోయిన కరోనా కేసులు..

మాది కాంగ్రెస్ కుటుంబమని.. స్థానిక పరిస్థితులు దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకున్నా..తాను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ లోకి వచ్చానని స్పష్టం చేశారు. షార్ట్ టైంలో ఎక్కువ పదవులు పార్టీ ఇచ్చిందని…తనకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. మీ అందరి కంటే చిన్న వాణ్ణి అని..అందరి అభిప్రాయాలు తీసుకుని..మెజారిటీ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటానని పేర్కొన్నారు రేవంత్‌ రెడ్డి.

Exit mobile version