Site icon NTV Telugu

హుజూరాబాద్ ఎన్నికలను ఖరీదైన ఎన్నికలుగా మార్చేశారు…

revanth reddy

దళిత బందు అపడం లో తెరాస.. బీజేపీ తోడు దొంగలు అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇద్దరి కుమ్మక్కు లో భాగమే దళిత బందు ఆగింది. రైతు బందు అగొద్దని ఎన్నికల కమిషన్ దగ్గర అమలు చేసిన కెసిఆర్..దళిత బందు విషయంలో ఎందుకు జోక్యం చేసుకోలేదు. దళిత బందు పాత పథకం అని తెరాస చెప్తుంటే… ఎందుకు ఇప్పుడు ఆగింది. సీఎం.. సీఏస్ ఎందుకు దళిత బందు అమలుకు చొరవ చుపట్లేదు. కేంద్ర మంత్రులు ఎందుకు ఎన్నికల అధికారులను కలవడం లేదు. తెరాస..బీజేపీ ఇద్దరు లంగా నాటకం అడుతున్నారు. హుజూరాబాద్ ఒక్కటే కాదు రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మందికి అమలు చేయండి అని తెలిపారు.

బీసీల మీదకు..దళితులను ఉసి గొలిపే చర్యలకు దిగుతున్నారు సీఎం. కులాల మద్య చిచ్చు పెట్టే కామెంట్స్ పై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలి. కేసు పెట్టి జైల్లో పెట్టాలి. దళితుల ను సీఎం చేయండి అని దళితులు అడగలేదు. ముడేకరాలు అడగలేదు. వర్గీకరణ జరగాలని డిమాండ్ చేశారు. సీఎం నీ అడుగుతున్న వర్గీకరణ కోసం ఎందుకు ఢిల్లీకి తీసుకెళ్లడం లేదు. ఇచ్చిన మాట ఉల్లంఘించిన నీచుడు కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తే… దళిత బిడ్డ లేనే లేడు. పార్లమెంటరీ పార్టీ సమావేశం లో దళిత నాయకులు లేనే లేరు. కేసీఆర్ పక్కన భజన పరులు కూర్చున్నారు. దాంట్లో కూడా దళితులు లేరు అని అన్నారు.

ఇక నీ నామినేషన్ దాఖలు చేసేందుకు ఒక్క దళిత బిడ్డని లోపలికి రానివ్వలేదు. అలాంటి నువ్వు.. దళితులకు నువ్వు బందువా అని ప్రశ్నించారు. హుజూరాబాద్ దళిత బిడ్డలకు విజ్ఞప్తి. మీకు పది లక్షలు రావు. ఖాతాలో డబ్బులు వేశాం కానీ.. ఇప్పుడు రావు అంటున్నారు. ఖాతాలో పడ్డట్టు ఎస్ఎంఎస్ వచ్చింది.. కానీ డబ్బులు ఉండవు. ఆ ఎస్ఎంఎస్ ను చూసుకొని సంతోష పడాలి ..చెప్పుకొని ఎడ్వాలి అన్నట్టు ఉంది దళిత బందు అని పేర్కొన్నారు.

Exit mobile version