NTV Telugu Site icon

Revanth Reddy: నేడు నాలుగు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం..

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వివిధ పార్టీల అభ్యర్థుల తరపున అగ్రనేతలు రంగంలోకి దిగారు. ఈ నెల 28న సాయంత్రంతో ముగియనున్న ప్రచారం ఐదు రోజుల పాటు కొనసాగనుంది. కాంగ్రెస్, బీజేపీ అగ్రనాయకత్వం కూడా అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన జన ఆశీర్వాద సభల్లో నాయకులు ప్రసంగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈనేపథ్యంలో.. నేడు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, కామారెడ్డి నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు నకిరేకల్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు తుంగతుర్తి బహిరంగ సభ అనంతరం మధ్యాహ్నం 2గంటలకు ఆలేరు బహిరంగసభలో పాల్గొననున్నారు. ఇక మధ్యాహ్నం 3.30కి కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, బీబీపేట కార్నర్ మీటింగ్ లో రేవంత్ పాల్గొని సభలో ప్రసంగించనున్నారు.

Read also: Dhruva Nakshathram postponed: విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ సినిమా మళ్లీ వాయిదా

రేవంత్ రెడ్డి నిన్న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. మానకొండూర్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మార్పు రావాలి కాంగ్రెస్ గెలవాలి, బై బై కేసీఆర్ నినాదంతో రేవంత్ రెడ్డి కార్యకర్తల్లో జోష్ నింపారు. కరీంనగర్ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియమ్మ మాట ఇచ్చింది.. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిందని అన్నారు. రెండు తెలుగు రాష్టాలలో అధికారం కోల్పోయినా.. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి ప్రతీకలు కరీంనగర్ ప్రజలు.. అందుకే ఉద్యమ సమయంలో కేసీఆర్ కు అవకాశాన్ని ఇచ్చారని రేవంత్ రెడ్డి చెప్పారు. 2004 నుండి 2009 వరకు కరీంనగర్ ప్రజలను కేసీఆర్ నమ్మించి మోసం చేసిండని ఆరోపించారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రాంత ప్రజలను నట్టేట ముంచి ఇప్పుడు కామారెడ్డి పోయిండని విమర్శించారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే రసమయికి రేవంత్ రెడ్డి చురకలు అంటించారు. తన దగ్గర గోసి, గొంగడి ఉందని ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిన వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అని దుయ్యబట్టారు.
Maharashtra: ముంబై విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను పేల్చివేస్తామని బెదిరింపు