NTV Telugu Site icon

Jagga Reddy: జగ్గారెడ్డి ఇఫ్తార్ విందు.. రేవంత్ కు దక్కని ఆహ్వానం

Jaggareddy

Jaggareddy

Revanth is not invited to Jaggareddy’s iftar dinner: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు నడుస్తోంది. కాంగ్రెస్ లో గ్రూపుల తగాదాలు మళ్లీ బయట పడ్డాయి. హైకమాండ్ ఎన్నిసార్లు చెప్పినా.. రాష్ట్ర ఇన్ ఛార్జి మారినా.. ఇక్కడి నేతల తీరు మారడం లేదు. పార్టీలో వర్గ విభేదాలు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. పార్టీ సీనియర్లంతా రేవంత్ రెడ్డిని దూరం పెడుతున్నారు. ఒకరిద్దరు తప్ప రేవంత్‌ ని ఎవరూ పట్టించుకోవడం లేదు. మంచిర్యాలలో జరిగిన సభే ఇందుకు నిదర్శనం కాగా మరోసారి రేవంత్‌ ను పార్టీనేతలంతా దూరం పెట్టడంపై చర్చకు దారితీస్తోంది. ఇవాళ సాయంత్రం సంగారెడ్డి లో జగ్గారెడ్డి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఇఫ్తార్‌ విందుకు ఇంచార్జి థాక్రే, ఉత్తమ్, కోమటిరెడ్డి లకు ఆహ్వానం పలికారు. అయితే పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టిలకు జగ్గారెడ్డి ఆహ్వానించలేదు. అయితే.. పాదయాత్రలో భట్టి వున్నారని కావున ఆయన్ను పిలువలేదని సమాచారం. అయితే.. రేవంత్ ని ఆహ్వానం ఇవ్వకపోవడంపై చర్చకు దారితీస్తోంది.

Read also: Dollars : అమెరికాలో డాలర్ల వర్షం.. రోడ్డుపై కార్లు ఆపి ఎగబడ్డ జనం

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా నస్పూర్ లో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ జరిగిన విషయం తెలిసిందే.. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. పార్టీ జాతీయ నాయకుడు కొప్పుల రాజు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మణిరావు ఠాక్రేతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, స్టార్ క్యాంపెయినర్ మధుయాష్కీ, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పలువురు హాజరయ్యారు. మల్లికార్జున ఖర్గేతో పాటు సభా వేదికపైకి వచ్చిన రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ పట్టించుకోలేదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేంసాగర్ రావు… వేదికపై నుంచి భట్టి విక్రమార్క చేతులెత్తి పాదాభివందనం చేశారు.

పలువురు నేతలు తమ ప్రసంగంలో భట్టి విక్రమార్కపై ప్రశంసల వర్షం కురిపించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి వైఎస్ఆర్ తో పోల్చారు. భట్టి పంచెకట్టుతో పాదయాత్ర చేస్తుండగా.. వైఎస్ఆర్ ను చూశానని చెప్పారు. ఈ సమయంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ‘సీఎం భట్టీ… సీఎం భట్టి’ అంటూ నినాదాలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, శ్రీధర్ బాబు కూడా భట్టి విక్రమార్కపై ప్రశంసలు కురిపించారు. రాబోయేరోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, వేదికపై ఉన్న నేతల్లో ఒకరు సీఎం కావడం ఖాయమని ప్రేంసాగర్ రావు అన్నారు. అనంతరం వేదికపై ఉన్న నేతలంతా భట్టి వైపు చూశారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి అసహనానికి గురయ్యారు. అయితే ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ఇఫ్తార్ విందుకు అందరికి ఆహ్వానం అందగా ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రం ఆహ్వానం అందక పోవడంపై పార్టీ వర్గాల్లో ఈవార్త సంచలనంగా మారింది.
Jangaon dabal bedroom: ఓపిక నశించి.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టి గృహ ప్రవేశాలు

Show comments