Site icon NTV Telugu

CM Revanth Reddy: రాష్ట్ర దశాబ్ది వేడుకలు.. గవర్నర్ కు సీఎం రేవంత్ ఆహ్యానం

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు రావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. దాదాపు 40 నిమిషాల పాటు గవర్నర్‌ను కలిశారు. అలాగే వేడుకల వివరాలను సీపీ రాధాకృష్ణన్‌కు ముఖ్యమంత్రి వివరించారు. జూన్ 2న సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఈ వేడుక జరగనుంది.

Read also: Drug Sales: హైదరాబాదులో డ్రగ్స్ విక్రయాలు.. అదుపులో నైజీరియన్..

ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరుకానున్న సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జూన్ 2వ తేదీ ఉదయం పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకావిష్కరణ, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాబృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.
Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ.. అందులో ఏముందంటే..!

Exit mobile version