Site icon NTV Telugu

Revanth reddy: 31వ రోజుకు చేరిన రేవంత్‌ పాదయాత్ర.. ఆర్మూర్‌లో జనసభ

Revanthreddy

Revanthreddy

Revanth reddy:టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్‌సే హాత్‌జోడో పాదయాత్ర నిజామాబాద్‌ నియోజక వర్గంలో కొనసాగతుంది. నేడు ఆర్మూర్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఉ 9:00 గంటలకు సిద్దుల గుట్ట ఆలయాన్ని సందర్శిస్తారు. నందిపేట మండలం లక్కంపల్లి SEZను రేవంత్‌ సందర్శించనున్నారు. సాయంత్రం 4:00 గంటలకు పెర్కిట్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. మామిడిపల్లి, ఆర్మూర్ కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ కు యాత్ర చేరుకోనుంది. ఆర్మూర్ పాత బస్టాండ్ వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ఇక్కడితో రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన ముగుస్తుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అనుబంధంగా టీపీసీసీ హాత్ సే హాత్ జోడో యాత్రను చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6న ప్రారంభించారు రేవంత్‌. రాహుల్ గాంధీ పాదయాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన వనదేవతలు సమ్మక్క, సారలమ్మల స్ఫూర్తితో ఈ యాత్ర చేపట్టారు రేవంత్ రెడ్డి.

నిన్నటి నుంచి భట్టి విక్రమార్క పాదయాత్ర..

కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిన్నటి నుంచి పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.. 90 రోజుల్లో 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు భట్టి విక్రమార్క. ఆయన పాదయాత్రలో 1,365 కిలోమీటర్లు నడవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి తర్వాత నియోజకవర్గాల సంఖ్య పరంగా ఇది రెండవ అతిపెద్ద పాదయాత్ర. ఈ పాదయాత్ర దాదాపు 50 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది. ముఖ్య అతిధులుగా పాల్గొనేందుకు రాజస్థాన్‌తో సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో నాలుగైదు పెద్ద బహిరంగ సభలు నిర్వహించనున్నారు. దళిత వర్గానికి చెందిన భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించి జూన్ 15న ఖమ్మం జిల్లాలో యాత్రను ముగించనున్నారు. ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’లో భాగంగా పాదయాత్ర చేపట్టాలని, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఏఐసీసీ నాయకత్వం భట్టిని కోరిందని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి తెలిపారు. అయితే.. ఇది వ్యక్తిగతంగా చేస్తున్న యాత్ర కాదని, ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ చేపట్టే యాత్రేనని ఇదివరకే భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, వివిధ సెక్షన్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కోట్లు ఖర్చు చేసినా వాటి ఫలాలు ప్రజలకు అందకపోవడం బాధాకరమన్నారు.
Cpm Jana Chaitanya Yatra: నేటి నుంచి సీపీఎం జనచైతన్య యాత్ర.. ప్రారంభించనున్నసీతారాం ఏచూరి

Exit mobile version