Bharat Jodo Yatra: తెలంగాణలో రాహుల్ గాంధీ భారత జోడో పాదయాత్ర కొనసాగుతోంది. కాంగ్రెస్ కు మద్దతుదారులైన సెలబ్రిటీలను ఇందులో భాగంగా చేస్తోంది. తద్వారా రాహుల్ పాదయాత్రకు మరింత ప్రజాదరణ తీసుకురావచ్చన్న వ్యూహం ఇందులో కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే నటి పూనమ్ కౌర్, బాలీవుడ్ సీనియర్ నటి పూజా భట్ రాహుల్ తో కలసి తెలంగాణలో కొద్దిదూరం నడిచారు. ఇవాళ సంగారెడ్డి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. చేర్యాల దగ్గర చిన్నారులతో కలిసి రాహుల్ గాంధీ కరాటే చేశారు. ఈనేపథ్యంలో.. రాహుల్ పాదయాత్రలో రిటైర్డ్ నావి చీఫ్ అడ్మిరల్ రామదాసు పాల్గొన్నారు. ఆయనకు 89 సంవత్సరాల వయసులో కూడా అడ్మిరల్ రామదాసు రాహుల్ గాంధీతో కలిసి చేతిలో చేయివేసి రామదాసు సతీ సమేతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. రాహుల్ పాద యాత్రకు మద్దతు పలుకుతూ ముందుకు సాగారు.
Read also:Mulayam Singh Yadav: ములాయం సింగ్ యాదవ్‌కు భారతరత్న ఇవ్వాలి.. కాంగ్రెస్ నేత డిమాండ్
రుద్రారం నుంచి భారత్ జోడో పాదయాత్ర ప్రారంభమైంది. భారత్ జోడో యాత్రనేడు ఆలస్యంగా మొదలైంది. మంచు కురవడంతో.. పది నిమిషాలు ఆలస్యంగా పాదయాత్ర ప్రారంభించారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ రోజూ ఉదయం 5.55 నిమిషాలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఈరోజు మంచు కారణంగా పదినిమిషాలు ఆలస్యంగా షురూ అయ్యింది. భారత్ జోడో యాత్రలో ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శైలజనాథ్, జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి. సీతక్క, భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్ తో కలిసి ముందుకు సాగుతున్నారు. అక్టోబర్ 23వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా కృష్ణా మండలం గూడేబల్లూరు గ్రామం వద్ద తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్‌గాంధీ నవంబర్ 2 నాటికి ఎనిమిది రోజుల్లో 170కి పైగా కిలోమీటర్లు నడిచారు. తొలి రోజు కేవలం 4 కిలో మీటర్లు మాత్రమే నడిచిన ఆయన మిగిలిన ఏడు రోజుల్లోనే 166 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడం గమనార్హం.