NTV Telugu Site icon

Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్.. ఈ నెల 20 వరకు ఆంక్షలు..!

Shamshabad Asirport

Shamshabad Asirport

Shamshabad: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఆగస్టు 15 సందర్భంగా ఈనెల 20వరకు శంషాబాద్‌ లో ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు, సందర్శకులకు కీలక సూచనలు జారీ చేశారు. ఆగస్ట్ 20 వరకు విమానాశ్రయంలోకి సందర్శకులను అనుమతించబోమని ప్రకటించారు.ఆగస్టు 16 వరకు అన్ని రకాల పాస్ లను రద్దు చేస్తున్నామని తెలిపారు.శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన రహదారిపై సీఐఎస్ ఎఫ్, రక్ష, పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీఐఎస్‌ఎఫ్ పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌లతో ఎయిర్‌పోర్టులో పార్కింగ్, బయలు దేరి, రాకపోకలను తనిఖీ చేస్తున్నారు. అయితే విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు వీడ్కోలు పలికేందుకు ఒకరిద్దరు మాత్రమే రావాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉందని శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.

Read also: Astrology: ఆగస్టు 10, గురువారం దినఫలాలు

రోజుకు సుమారు 5 వేల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులు ఈ నెలలోనే వెళ్తున్నారని వెల్లడించారు. వారిని పంపించేందుకు చాలా మంది వస్తుండటంతో ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఒక్కో విద్యార్థిని పంపించేందుకు 30 నుంచి 50 మంది వస్తున్నారని తెలిపారు. పది రోజులుగా రోజుకు లక్ష మంది విమానాశ్రయానికి వస్తున్నారని నారాయణరెడ్డి తెలిపారు. విమానాశ్రయానికి వచ్చే వారంతా వ్యక్తిగత వాహనాల్లో వస్తున్నారని, దీంతో ట్రాఫిక్‌, పార్కింగ్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. విమానాశ్రయానికి రోజుకు 70 వేలకు పైగా కార్లు వస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఎయిర్‌పోర్టులో అప్రమత్తంగా ఉండనున్నట్లు ప్రకటించారు. విమానాశ్రయంలో ఆంక్షలు ఉంటాయని, సెండ్ ఆఫ్ కోసం వచ్చే తల్లిదండ్రులు రావద్దని సూచించారు.
Lottery: జాక్ పాట్.. లాటరీలో రూ.13వేల కోట్లు గెలుచుకున్నాడు..

Show comments