CM Revanth Reddy: తెలంగాణ CM రేవంత్ నివాసంలో రిపబ్లిక్ డే వేడుకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ CM రేవంత్ నివాసంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగరేశారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ శోభతో కళకళలాడుతోందని అన్నారు. రాజధాని ఢిల్లీతోపాటు ప్రధాన నగరాలన్నీ విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్నాయ్ అని తెలిపారు. ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలనే మన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున జరుపుకునే ఈ పండుగను ప్రజలందరూ సగర్వంగా జరుపుకోవాలని అన్నారు.
Read also: Tamilisai: సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేలా రేవంత్ రెడ్డి పాలన..
Also Read
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
రాజ్యాంగ నిర్మాతలను, దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన మహనీయులను గుర్తు చేసుకోవాలని అన్నారు. ప్రజల పోరాటంతో పాటు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణలో కొలువు దీరిన కొత్త ప్రభుత్వం రాజ్యాంగ ఆశయాలు, లక్ష్యాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉంటుందని అన్నారు. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే తమ ప్రభుత్వం ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిందని, ప్రజలే పాలకులనే జవాబుదారీతనంతో పని చేస్తుందని అన్నారు. నియంత పోకడలను పాతర పెట్టి, రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణానికి సిద్ధపడిందని అన్నారు.
Russian plane crash: కూలిన రష్యా సైనిక విమానం.. బ్లాక్ బాక్స్ స్వాధీనం..!
తాజావార్తలు
-
Rajat Patidar: ధోనీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
-
Peddi Pre-Release Event : నేడే బెజవాడలో రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బ్యాటింగ్..
-
Virat Kohli: ఈరోజు నా కల నిజమైంది.. ఈ విజయాన్ని నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోను.. కింగ్ కోహ్లీ భావోద్వేగం!
-
DK Shivakumar: ఆర్సీబీ అభిమానులకు అన్యాయం.. నిర్వాహకులపై విమర్శలు గుప్పించిన డీకే శివకుమార్
-
RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!