Site icon NTV Telugu

Renuka Chowdhury : స్త్రీలకు రక్షణ లేదు.. ఇదేనా బంగారు తెలంగాణ అంటే…

Renuka Chowdhury

Renuka Chowdhury

రాష్ట్రంలో కొత్తగా మరో ముగ్గురు మహిళల పై అఘాయిత్యం జరిగాయి. పోలీసుల లెక్కల చూస్తే..మహిళలలపై రేప్ కేసులు పెరిగాయి.. ఇదేనా బంగారు తెలంగాణ అంటే కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి మండిపడ్డారు. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పసి పిల్లలకు కూడా తెలంగాణ లో రక్షణ లేదని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ కేసులో అధికార పార్టీ నేతల పిల్లలు ఉన్నారు కాబట్టే.. ఈ కేసు ను నీరుగారుస్తున్నారని, మైనర్ బాలిక వీడియోను బయటపెట్టిన ఎమ్మెల్యే రఘునంధన్ రావు దోషే అంటూ ఆమె ఉద్ఘాటించారు. రఘునంధన్ రావు ఇన్నోవా బండి వీడియో ఎందుకు బయటపెట్టలేదని, రఘునంధన్ రావు సిగ్గుమాలిన ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె విమర్శించారు.

కేసులో కాంగ్రెస్ నేతల పిల్లలు ఉంటే…రఘునంధన్ రావు బయట పెట్టాలని, జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసు వదిలేది లేదని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ షీ టీమ్స్ ఏమైయ్యాయని, నగరంలో రక్షణ లేనప్పుడు.. పెట్టుబడులు ఎలా వస్తాయన్న రేణుకా చౌదరి.. బీజేపీ విషయంలో టీఆర్ఎస్ యూ టర్న్ తీసుకుందని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ తోడుదొంగలు, కవల పిల్లల లాంటి వారు అని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో పబ్బుల కల్చర్ పెరిగిందని, లైసెన్స్ లు ఇస్తుంది..ఎక్సైజ్ శాఖ కాదా అని ఆయన అన్నారు. బీజేపీ మరోమతాన్ని కించరపరచడం సరైంది కాదని, సనాతన ధర్మం బీజేపీకి తెలుసా అని ఆమె ప్రశ్నించారు.

Exit mobile version