Site icon NTV Telugu

Renuka Chowdhury F2F : నాక్కూడా పోలీసులు సారీ చెప్పాలి

Renuka Chowdhury

Renuka Chowdhury

నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక వ్యవహారంలో సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నాయి. అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిరసనలు తారాస్థాయికి చేరాయి. రాజ్‌భవన్‌ ముట్టడికి టీ కాంగ్రెస్‌ పిలుపునివ్వడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు రేణుక చౌదరి ఈ ఆందోళనలల్లో ఓ ఎస్సై కాలర్‌ పట్టుకున్నారు. ఈ ఘటన వివాదస్పదం తావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీవీతో రేణుకా చౌదరి ఫేస్‌ టు ఫేస్‌లో మాట్లాడుతూ.. కాలర్ పట్టుకోవాలని చేసిన పని కాదని.. మగ పోలీసులకు మా వెనకాల పనేంటి ..? అని ఆమె ప్రశ్నించారు.

 

ఎస్సైకి సారీ చెప్పడానికి నాకేం ఇబ్బంది లేదని.. కానీ.. నాక్కూడా పోలీసులు సారీ చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. మా మీద కేసులు పెట్టడం కాదని, అధికార పార్టీ ఎమ్మెల్యేల పేర్లు చెప్పి.. వీడియోలు పెట్టీ ఆత్మహత్య చేసుకున్నారని,
వాటి మీద కూడా కేసులు పెట్టాలని ఆమె వ్యాఖ్యానించారు. ఖమ్మంలో అరాచకాలపై కేసులు లేవ్వే అని ఆమె ఉద్ఘాటించారు.

Exit mobile version