Site icon NTV Telugu

Renuka Chowdhury: కేటీఆర్ పై రేణుకా చౌదరి ఫైర్.. పేపర్ల లీకేజీకి బాధ్యత వహించాలి..

Renuka Choudari

Renuka Choudari

Renuka Chowdhury: విద్యార్థుల ప్రాణాలకి విలువ లేదా? కేటీఆర్ ఐటీ కింగ్ అంటారు.. పేపర్ల లీకేజీకి ఆయనే బాధ్యత వహించాలని కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖాబార్థార్… జాగ్రత్తగా ఉండు కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు. కేసీఆర్ తన పార్టీ పేరు మార్చి తన జాతకం, గోత్రం మార్చుకున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. నిస్సహాయతతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్నారు. కేసీఆర్ సొల్లు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. అప్పులు చేసి తల్లితండ్రులు పిల్లలని చదివిపిస్తున్నారన్నారు. ఇది పనికి మాలిన ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు.

కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాటలకి జీఎస్టీ లేదు కాబట్టి కేసీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. కేటీఆర్ ఐటీ కింగ్ అంటారు.. మరి పేపర్ల లీకేజీకి ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ అంటూ పిల్లల బతుకులు నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. TSPSC పై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. విద్యార్థులను పోలీసులు చావబాధుతున్నారని మండిపడ్డారు. ప్రజా రక్షకులుగా ఉండాల్సిన పోలీసులకు మనసులేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి తోత్తులుగా ఉంటూ…. విద్యార్థులను కొడతారా? మేం అధికారంలోకి రాగానే TSPSC పై విచారణ జరిపిస్తాం? విద్యార్థుల ప్రాణాలకి విలువ లేదా? అంటూ ఫైర్ అయ్యారు.
Israel-Hamas War: బందీలుగా తీసుకున్న చంటి పిల్లలను ఆడిస్తున్న హమాస్ ఉగ్రవాదుల.. వీడియో వైరల్..

Exit mobile version