NTV Telugu Site icon

Bhashyam Vijayasarathy: పద్మశ్రీ భాష్యం విజయసారధి ఇకలేరు..

Bashyam Vijayasaradhi

Bashyam Vijayasaradhi

Bhashyam Vijayasarathy: కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ పండితుడు, రచయిత, కవి పద్మశ్రీ భాష్యం విజయ్ సారథి కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ సారథి కరీంనగర్ శ్రీపురం కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. అర్ధరాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో.. తుది శ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. భాష్యం విజయసారథి పాండిత్యాన్ని, గొప్పతనాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2020లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మందాకిని కావ్య కవిగా ప్రాచుర్యంలోకి తెచ్చిన శ్రీభాష్యం విజయసారథి సంస్కృత భాషలో దిట్ట. రాగయుక్తంగా కవిత్వం చెప్పడంలో ప్రావీణ్యం సంపాదించి మహాకవిగా ఆయన ప్రశంసలు అందుకున్నారు. దేశవ్యాప్తంగా కవి సమ్మేళనాలలో పాల్గొనడమే కాకుండా, క్రతువుల నిర్వహణలో ఆయన సుప్రసిద్దులనే చెప్పాలి. విజయసారథి సేవలకు గాను ఇప్పటికే ఎన్నో రివార్డులు, అవార్డులు అందుకున్నారు. ఆయన సాహిత్య సేవకు గాను సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి స్పీకర్‌ అయ్యదేవర కాళీశ్వరరావు చేతుల మీదుగా మహాకవి బిరుదును అందుకున్నారు.

Read also: Today Business Headlines: ఏజీ 365 డ్రోన్‌కి కేంద్ర ప్రభుత్వ అనుమతి

కరీంనగర్ జిల్లా చేగుర్తి గ్రామంలో నరసింహాచార్యులు, గోపమాంబ దంపతులకు 1936 మార్చి 10న జన్మించిన విజయసారథి తన 7వ ఏటనే కవిత్వం రాయడం ప్రారంభించారు. ప్రాథమిక విద్యాభ్యాసం ఉర్దూ మాధ్యమంలో ఉన్నప్పటికీ సంస్కృత పండితుడిగా రాణించారు. కరీంనగర్ పట్టణ శివార్లలోని బొమ్మకల్ లో యజ్ఞ వరాహ స్వామి ఆలయాన్ని స్థాపించి హిందూ ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకున్న మహనీయుడిగా ప్రజలకు సుపరిచితుడు. 22 ఏళ్ల వయసులోనే కవిగా తనదైన ముద్ర వేశారు. సంస్కృతం, తెలుగు భాషల్లో 100కి పైగా పుస్తకాలు రాశారు.
Raw Egg: పచ్చి గుడ్డు తింటే.. వామ్మో