Site icon NTV Telugu

తెలంగాణ ఇంటర్‌ అకాడమిక్ క్యాలెండర్ విడుదల..

Exams

తెలంగాణలో ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. 220 పనిదినాలతో…. రెండు టర్మ్‌లుగా అకడమిక్ ఇయర్ ఉంటుందని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. సెప్టెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ 18 వరకు మొదటి టర్మ, డిసెంబర్ 20 నుంచి ఏప్రిల్ 13 వరకు సెకండ్ టర్మ్ ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 13 నుంచి 18 వరకు హాఫ్‌ ఇయర్లీ ఎగ్జామ్స్‌, మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు ఇంటర్ ఫైనల్‌ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఈ ఏడాది వందశాతం సిలబస్ ఉంటుందని… సిలబస్‌లో తగ్గింపు లేదని స్పష్టం చేసింది ఇంటర్‌బోర్డు. ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి.

Exit mobile version